శ్రావణమాసం బోనమెత్తిన శివసత్తులు

WhatsApp Image 2025-08-15 at 7.07.28 PM

ములుగు జిల్లా ప్రతినిధి : జిల్లాకేంద్రంలో శ్రావణ శుక్రవారం శివసత్తులు భారీ స్థాయిలో బోనం ఎత్తుకొని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జక్కుల భవాని ఇంటి వద్ద ప్రత్యేక భోనాల పండుగ చేశారు. ఉదయం నుండి ఉపవాస దీక్ష చేస్తూ బోనాల పండుగ జరిపారు. శ్రావన మాస బోనాలకు బొట్టుపెట్టి ఆలంరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో భాజా భజంత్రీల నడుమ వివర్స్ కాలనీ నుండి ములుగు పురవీధుల గుండా బోనంతో నృత్యాలు చేస్తూ పోషమ్మ తల్లి గుడికి బయలుదేరారు. నేడు నాలువగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ దేవికి అత్యంత ఇష్టమైన రోజు కావడం ఆమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పులిమేరలోకి దుష్టశక్తులు రాకుండా బొడ్రాయి (గ్రామ దేవతకు) పూజలు చేశారు. పట్టణ వాసులు, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో, ఆర్థిక, వ్యాపార లావాదేవీలతో అభివృద్ధి చెందుతూ చల్లగా ఉండేలా చూడు తల్లీ అంటూ పోషమ్మ అమ్మవారిని వేడుకున్నారు. సుమారు రెండు గంటల పాటు శివసత్తులు పూనకాలతో జాతీయ రహదారిపై బోనంతో నృత్యాలు చేస్తూ పోచమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, సారలతో పాటు కల్లు శాకం, జుంతు బబి ఇచ్చి బోనం మొక్కులు సమర్పించుకున్నారు. సంస్కృతి, సాంప్రదాయానికి ప్రత్యేకగా శివసత్తుల బోనాలు కొనసాగాయి.నాలుగవ శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం పోషమ్మ తల్లి బోనాలకు ప్రాధాన్యత చోటుచేసుకున్న రోజు కావడం వివిధ ప్రాంతాల నుంచి శివసత్తులు పోచమ్మ గుడి వద్దకు బారులు తీరారు. బోనాల పండుగ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జక్కుల భవాని చౌదరి శివశక్తి బోనం,ట్రాన్స్ జెండర్ రాష్ట్ర అధ్యక్షురాలు లెజెండ్ ఓరుగంటి లైలా మలకమ్మ,గొల్లల యాకమ్మ చౌదరి,కక్కు కల్పనమ్మ, ఎనగందుల మొగిలి చౌదరి,బాబు నర్సయ్య,బొచ్చు శంకర్ చౌదరి,పుల్లా శైలేంధర్ చౌదరి,కక్కెర్ల రేణుక చాముండి,నెల్లికట్టె రమేష్,అంతుకురి నర్సయ్య,బొల్లా చందు,క్యాతరాజు శశి,దున్నపోతుల వంశీ,కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Read More పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం

About The Author