స్మార్ట్ కిడ్జ్ లో ఉత్సాహంగా స్వయంపాలన దినోత్సవం..

ఖమ్మం ప్రతినిది :

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..  
ఘనంగా “టీచర్స్ డే”.. 

WhatsApp Image 2025-09-04 at 6.56.56 PM

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గురువారం సెప్టెంబర్ 5 తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలలో  టీచర్స్ డే సందర్భంగా ఉత్సాహంగా స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని తరగతులలో బోధన నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ గా, ఉపాధ్యాయులుగా, సబ్ స్టాఫ్ గా విద్యార్థులే విధులు నిర్వహించి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులు బోధన నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. చీరకట్టు, పంచ కట్టులు ధరించి తమ బోధన అనుభవాన్ని చూపడం అందర్నీ ఆకర్షించింది. పాఠశాలలోని 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా రోజంతా తరగతులు నిర్వహించారు. తొలుత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే మహోన్నతమైనదని తెలిపారు. శిష్యులను తరతమ భేదాలు లేకుండా ఉన్నత స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. తమ శిష్యులు ఉన్నత స్థాయిలో ఎదిగినప్పుడు తొలుత  సంబరపడేది ఉపాధ్యాయులేనని  పేర్కొన్నారు. నూతన,ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉపాధ్యాయులు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యను అందిస్తూ దేశ, విదేశాలలో విద్యార్థులు అత్యుత్తమంగా ఎదిగేలా తీర్చిదిద్దుతున్నారని, ఇది కేవలం ఉపాధ్యాయ వృత్తికే సాధ్యమని వివరించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేశారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More ప్రశంసా పత్రాలు అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ పీఆర్వో నరిమెట్ల వంశీ..

About The Author