రాష్ట్రపతి ముర్ముపై సోనియా, రాహుల్ వాఖ్యలు సరికాదు

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): రాష్ట్రపతి ముర్ము పై కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా బిజెపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కట్ట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ చౌక్ లో బ్లాక్ రిబ్బన్ లు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి ఎస్టి మోర్చా నేతలు, ఇతర నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి రాహుల్ గాంధీ , సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ నాయక్, జిల్లా అధ్యక్షులు కట్టా రాజ్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ స్పందించిన తీరు సరికాదన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ‘వెరీ బోరింగ్. నో కామెంట్’ అని రాహుల్ అంటే సోనియా గాంధీ ‘పూర్ లేడీ. చదివీ చదివీ చివరకు అలసిపోయారని, అంత చదవాల్సింది కాదని విడ్డూరంగా , హేళనగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగ పదవి రాష్ట్రపతి హోదాలో ముర్ము ఉన్నప్పటికీ అగౌరపరిచేలా , కించపరిచేలా రాహుల్ గాంధీ సోనియాగాంధీ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివాసీలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. ఇప్పటికైనా రాహుల్ , సోనియా లు బుద్ధి మార్చుకొని తక్షణమే రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టమని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాంపల్లి శ్రీనివాస్, కొడిత్యాల సురేష్, మామిడి చైతన్య, రమేష్, సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారి గాయత్రీ దేవి, ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు సుబ్బులు బిజిలి సారయ్య, అనిల్ , జిల్లా కార్యదర్శి మొగిలి శ్రీనివాస్ , నాయకులు రవి నాయక్ , లొకిని శ్రీనివాస్ కట్ట సంపత్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ముర్ముపై సోనియా, రాహుల్ వాఖ్యలు సరికాదు

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
రాష్ట్రపతి ముర్ము పై కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా బిజెపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కట్ట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ చౌక్ లో బ్లాక్ రిబ్బన్ లు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి ఎస్టి మోర్చా నేతలు, ఇతర నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి రాహుల్ గాంధీ , సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ నాయక్, జిల్లా అధ్యక్షులు కట్టా రాజ్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ స్పందించిన తీరు సరికాదన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ‘వెరీ బోరింగ్. నో కామెంట్’ అని రాహుల్ అంటే సోనియా గాంధీ ‘పూర్ లేడీ. చదివీ చదివీ చివరకు అలసిపోయారని, అంత చదవాల్సింది కాదని విడ్డూరంగా , హేళనగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగ పదవి రాష్ట్రపతి హోదాలో ముర్ము ఉన్నప్పటికీ అగౌరపరిచేలా , కించపరిచేలా రాహుల్ గాంధీ సోనియాగాంధీ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివాసీలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. ఇప్పటికైనా రాహుల్ , సోనియా లు బుద్ధి మార్చుకొని తక్షణమే రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టమని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాంపల్లి శ్రీనివాస్, కొడిత్యాల సురేష్, మామిడి చైతన్య, రమేష్, సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారి గాయత్రీ దేవి, ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు సుబ్బులు బిజిలి సారయ్య, అనిల్ , జిల్లా కార్యదర్శి మొగిలి శ్రీనివాస్ , నాయకులు రవి నాయక్ , లొకిని శ్రీనివాస్
కట్ట సంపత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author