సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన- ఎస్పి నరసింహ

 

WhatsApp Image 2025-11-14 at 7.27.51 PM

Read More నేటి భారతం :

సూర్యాపేట : 

Read More నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం రోజు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను, పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్మెంట్ మొదలగు అంశాలను పరిశీలించారు.పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించాలని ఎస్సైని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట పటిష్టమైన నిగా ఉంచి భద్రత పర్యవేక్షణ చేయాలని అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాలను పటిష్టంగా నిర్మూలించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి నుండి ఫిర్యాదులు స్వీకరించాలని, వారితో మర్యాదగా, గౌరవంగా నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఫిర్యాదు పై వెంటనే త్వరితగతిన స్పందించి, ప్రాథమిక విచారణను వేగంగా నిర్వహించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదులో ఎలాంటి జాప్యం ఉండవద్దని సూచించారు. సంఘటనలపై, పిర్యాదులపై  త్వరగా కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగంగా చేయాలని అన్నారు. నేరస్తులకు శిక్షలు అమలైయ్యేలా నాణ్యమైన దర్యాప్తు చేయాలని అన్నారు, ప్రతి ఫిర్యాదు పై రసీదు ఇచ్చి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు.  సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తేవాలని, జట్టుగా పనిచేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాలను కట్టుదిట్టంగా నివారించాలని ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బైండోవర్ చేయడం, వాహనాలను సీజ్ చేయడం లాంటి చర్యలు అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులోకి ఉండే విధంగా విజువల్ పోలీసింగ్ నిర్వర్తించాలి, డయల్ 100 ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాత్రిళ్ళు పెట్రోలింగ్ పకడ్బందీగా చేయాలని, జాతీయ రహదారి వెంట నిఘా ఉంచాలని సూచించారు. రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై బాలు నాయక్ ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.. 

Read More చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయితి కార్యాలయంలో నామినేషన్స్

About The Author