కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15 న నిర్వహించే సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలి..

పిలుపునిచ్చిన మంత్రి సీతక్క..

కామారెడ్డి : 

WhatsApp Image 2025-09-11 at 6.43.28 PM

ప్రజా పాలనలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ బిసి డిక్లరేషన్ అమలు చేస్తూ కామారెడ్డిలో నిర్వహిస్తున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ బీబీపేట్, దోమకొండ,  బిక్నూర్ ,మండల కేంద్రాలలో ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్.

Read More 111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు..

ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ, ఈరోజు అధికారంలో ఉన్నామంటే కార్యకర్తల పది సంవత్సరాల పోరాటం, వారి కష్ట ఫలితమే 
ఎన్నికల్లో ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాము అవి నెరవేరుస్తున్నాం, బీసీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ మా నివాసంలోనే జరిగింది. కామారెడ్డి పట్టణంలోనే డిక్లేర్ చేశారు అమలు విజయోత్సవ సభ కూడా కామారెడ్డిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.

Read More ఎన్‌హెచ్ - 44, సదాశివనగర్ లిమిట్స్ లో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..

ఈ సభను కనివిని ఎరగని రీతిలో విజయవంతం చేసి బిజెపి ప్రభుత్వానికి కనువిప్పు చేయాలి.. రాహుల్ గాంధీ 4,వేల కి.మీ ,పైగా పాదయాత్ర చేసి దేశవ్యాప్తంగా ప్రజల మనసులను అర్థం చేసుకుని, తెలంగాణ ప్రజలకు కావలసిన పథకాలను రూపొందించి అందిస్తున్నారు వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడం లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది

Read More రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ .. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొంది పార్లమెంట్ లో ఆమోదింప చేయడానికి ఢిల్లీలో ధర్నా  చేసాం, బిజెపి అసలు రంగు బయట పెట్టాం.. అణగారిన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుపేదల ఓటు హక్కును తొలగిస్తోందని, దేశ సంపదను అంబానీ, అదానీ వంటి ఉన్నత వర్గాలకు దోచిపెడుతోందని విమర్శించారు.

Read More కాళోజి జయంతి వేడుకలు

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15 న నిర్వహించే సభ కనీవినీ ఎరుగని రీతిలో  విజయవంతం చేయాలి,  బీసీ బిల్లు తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా ముందుకు వెళ్తున్నామన్నారు. సభను విజయవంతం చేయడానికి లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు. నీతి, నిజాయితితో, నిబద్ధతతో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, రాష్ట్రం పంపిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకుంటూ రాజకీయం చేస్తుందన్నారు. కులగణనలలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొనలేదన్నారు. సోషల్ ఇంజనీర్, సోషల్ జస్టిస్ జరగాలని బీసీలకు పదవుల పంపకం చేశామని, బీసీలంతా కంకనబద్ధులై సభకు తరలిరావాలని కోరారు. 

Read More నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

కేటీఆర్ సోషల్ మీడియాను అడ్డంగా చేసుకొని అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాడు, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా మహిళలకు రుణాలు  ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని, ఎన్నెన్నో కొత్త పథకాలు తీసుకువస్తూ మహిళా క్యాంటీన్లు మహిళలకు బస్సులు, పెట్రోల్ బంకులు, ఇలా అనేకమైన పథకాలు తీసుకువచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాం, ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇస్తున్నాం, ఉచిత కరెంట్ అందిస్తున్న, 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తున్నాం, ఒకేసారి 9,000 కోట్ల రూపాయలతో రైతులకు రైతు భరోసా అందించాం, 50,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం, యూరియా అందించే బాధ్యత కేంద్రానిది మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, ఎలాంటి కొరత పడకుండా రైతులకు సరిపడా యూరియాను అందిస్తున్నాం.
అందరు సోషల్ మీడియా వేదికగా యూరియా కొరత సృష్టిస్తున్నారు అన్నారు.
కొందరు కులం పేరుతో రాజకీయాలు చేస్తూ మన మధ్య గొడవలు సృష్టిస్తున్నారు.

Read More అవినీతినే తన స్టాంపుగా మార్చుకున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ..

About The Author