జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

  • కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం విడనాడాలి
  • విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లులు కార్పొరేట్ శక్తులలాభాల కోసమే
  • కార్పొరేట్ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో లక్షలాదిమంది రైతులు, కార్మికులు,వ్యవసాయ కార్మికులు పాల్గొనాలి
  • అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి- బి.వెంకట్

     

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

సూర్యాపేట:

 125 రోజుల పని నోటిఫైడ్ ఏరియాలకు మాత్రమే వర్తిస్తుందని బిల్లులో పేర్కొందన్నారు  .కేంద్ర ప్రభుత్వము గత చట్టంలో 90 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% మాత్రమే ఖర్చు చేసేది అన్నారు. కానీ ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడం కొరకు రాష్ట్రాలు 40 శాతం వాటా చెల్లించాలని ఈ చట్టంలో పొందుపరిచారని విమర్శించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడం వల్ల ఉపాధి హామీ పనులు ఆగిపోతాయన్నారు .ఈ విధంగా ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం అవుతుందని చెప్పారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని పని దినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని దీని ద్వారా కార్మికుడు సంఘం పెట్టుకునే హక్కు నీ సమ్మె చేసే హక్కుని కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన నరేంద్ర మోడీ సర్కార్ రైతులు పెద్ద ఎత్తున సంవత్సర కాలంగా పోరాటం చేసి అనేకమంది అమరులై నరేంద్ర మోడీ మెడలు వంచి రెండు చేతుల క్షమాపణ చెప్పించిన ఘనత రైతు పోరాటందని అన్నారు.వెంటనే తప్పుడు చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశంలోని 40 కోట్ల మంది కార్మికుల హక్కులను కార్పొరేట్ యజమానుల పాదాల కింద నలిపివేయాలనే లక్ష్యంతో కేవందేళ్ల కార్మిక ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను ఒక్క కలంతో తుడిచిపెట్టడమే లేబర్ కోడ్ల అసలైన ఉద్దేశమని అన్నారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను పక్కనపెట్టి, పార్లమెంట్‌లో ప్రతిపక్షాన్ని అణిచివేసి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూఈచట్టాలనుఆమోదింపజేయడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఫిక్స్‌డ్ టర్మ్ ఉపాధి పేరుతో శాశ్వత ఉద్యోగాల నాశనం, హైర్ అండ్ ఫైర్ విధానంతో ఉద్యోగభద్రతఅంతమొందింపు, కనీస వేతనాన్ని నిర్వచించకుండా కార్మికుడిని ఆకలిచావుకు నెట్టడం, ట్రేడ్ యూనియన్ హక్కులపై ఆంక్షలు, కాంట్రాక్టు–వలస కార్మికులపై నిర్బంధంలేని దోపిడీ, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, గ్రాట్యుటీ వంటి సాంఘిక భద్రతా చట్టాల నిర్వీర్యం, తనిఖీ వ్యవస్థ రద్దు చేసి యజమానుల సెల్ఫ్ సర్టిఫికేషన్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా కార్మిక వర్గాన్ని పూర్తిగా నిరాధారులుగా మార్చడమే ఈ కోడ్ల లక్ష్యమని అన్నారు.మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పాలన సాగిస్తూ కార్మికుల జీవితాలపై బుల్డోజర్లు నడుపుతోందని, లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై బహిరంగ యుద్ధ ప్రకటనతో సమానమని స్పష్టం చేశారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, పాత కార్మిక చట్టాల పునరుద్ధరణ, గౌరవప్రదమైన కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సాంఘిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కుల సంపూర్ణ అమలే లక్ష్యంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కుల,మత,వర్గ భేదాలు లేకుండా కార్మికులు, ఉద్యోగులు, ప్రజలంతా ఏకమై పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు గట్టి రాజకీయ సమాధానం ఇవ్వాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొలిశెట్టి యాదగిరిరావు, కొప్పుల రజిత, దేవరం వెంకటరెడ్డి, మేరెడ్డి కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు చెరుకు ఏకలక్ష్మి, ఎం రాంబాబు, సేలం శ్రీను, ఎలక సోమయ్య గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జంపాల స్వరాజ్యం, పోసనబోయిన హుస్సేన్, సోమపంగా జానయ్య, ఆరే రామకృష్ణారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు మద్దెల జ్యోతి, వేల్పుల వెంకన్న, వల్లపు దాసు సాయికుమార్, పిండిగా నాగమణి, మిట్టపల్లి లక్ష్మి, చర్లపల్లి మల్లయ్య, దోసపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Related Posts