గీతంలో ఘనంగా ప్రారంభమైన ప్రిన్సిపాల్స్ కొలోక్వియం

సంగారెడ్డి :

- పీఎస్ పీఏ సహకారంతో నిర్వహణ
- దేశవ్యాప్తంగా తరలి వచ్చిన 150 మంది ప్రధానోపాధ్యాయులు

 

WhatsApp Image 2025-09-26 at 6.52.16 PM

జాతీయ పాఠశాల ప్రిన్సిపాల్స్ శిఖరాగ్ర సదస్సు ప్రిన్సిపాల్స్ కొలోక్వియం-2025 పేరిట హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైంది. ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ (పీఎస్ పీఏ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సంగోష్ఠిలో పాల్గొనేందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ, ఐబీ, జాతీయ పాఠశాలలకు చెందిన 150 మంది ప్రిన్సిపాల్స్ తరలివచ్చారు. ‘ఉన్నత విద్యను తిరిగి ఊహించుకోవడం: నాయకత్వం, విధానం, ఆచరణ’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థ కోసం పాఠశాలలు, ఉన్నత విద్య, పరిశ్రమలను అనుసంధానించే కార్యాచరణపై చర్చించనున్నారు.తొలుత, పీఎస్ పీఏ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ స్వాగత ప్రసంగం చేయగా, గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఈ రెండు రోజుల కార్యక్రమ వివరాలను తెలియజేశారు. హైదరాబాదులోని రామకృష్ట మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ‘వేగంగా మారుతున్న ప్రపంచంలో నీతి, విలువలతో నడిచే నాయకత్వం’ అనే అంశంపై ప్రసంగించారు. ‘2047కి అభివృద్ధి చెందిన భారత్ ను రూపొందించడం: పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలను సమన్వయం చేయడం’ అనే అంశంపై గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు ఉపన్యసించారు. తదుపరి తరం శాస్త్రవేత్తలను పెంపొందించడం: పాఠశాలల్లో ఉత్సుకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడం’ అనే అంశంపై ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ సయ్యద్ ఇ. హస్నైన్ ప్రసంగించారు. ‘బలమైన పునాదులను నిర్మించడం: పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల భవిష్యత్తును ఎలా రూపొందిస్తాయి’ అనే అంశంపై లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఎన్ఎస్ఏబీ సభ్యుడు డాక్టర్ జి. సతీష్ రెడ్డి ‘జాతీయ అభివృద్ధి కోసం సైన్సు, టెక్నాలజీని ఉపయోగించడం’పై ఉపన్యసించారు. ‘డిజిటల్ భవిష్యత్తు కోసం విద్యా నాయకులను శక్తివంతం చేయడం’పై పాన్ ఫిష్ సొల్యూషన్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ అనురాధరావు తన ఆలోచనలను పంచుకున్నారు. గ్రీస్ విద్యావేత్త, పరిశోధకురాలు డాక్టర్ రాయినా లాంపౌ ‘స్టెమ్ విద్యలో సాంకేతికత, ఆవిష్కరణలు పెంచడం’ అనే అంశంపై ప్రసంగించారు.

జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమైన ఈ సంగోష్ఠిలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి కూడా తన అనుభవాలను పంచుకున్నారు. పాఠశాల నుంచి స్థిరమైన ఉపాధి వరకు ప్రయాణంలో ఉన్న అవరోధాలపై ఆలోచింపజేసే చర్చ జరగ్గా, విద్యా ఆడిటర్ డాక్టర్ సవిత లక్ష్మణ్ సమన్వయం చేశారు. ఇక చల్లని సాయంత్రం ఆహ్లాదకరమైన సంగీతం, పలు కథనాలు, సంభాషణలతో ఒకరిని మరొకరు పరిచయడం చేసుకోవంతో తొలిరోజు సంగోష్ఠి ముగిసింది. 

About The Author