ములుగు లో పోటీ పడుతున్న ముగ్గురు
ములుగు జిల్లా ప్రతినిధి, నవంబర్20(భారతశక్తి) : ములుగు నియోజకవర్గం లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతుంది ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముఖాముఖి పోటీనే ఉండేది, ప్రస్తుతం నవంబర్ 30న జరిగే ములుగు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనసరి సీతక్క, భాజాపా అభ్యర్థి అజ్మీరా ప్రహ్లద్; భారాస అభ్యర్థి బడే నాగజ్యోతి లమధ్య పోరుకొనసాగుతుంది. ప్రజాసేవా, వారసత్వమా, సంక్షేమ పథకాల,నువ్వా నేనా… అనే విధంగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గిరిజనులు గిరిజన నేతరులు గిరిజనుల్లో ఆదివాసి లంబాడా అనే ప్రధాన అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయా, గిరిజన ఓట్ల కంటే నియోజకవర్గంలో గిరిజన నేతరుల ఓట్లు అధికంగా ఉంటాయి వీరు ఎవరికీ మద్దతిస్తారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భారాస, కాంగ్రెస్ నుంచి ఆదివాసి గిరిజన సామాజిక వర్గం, భాజపా నుంచి లంబాడ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఈ సామాజిక వర్గాలు ఎవరిని ఆదరిస్తాయనేది కూడా ప్రధానంగాచర్చనీయాంశమైంది. సీతక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షంగానే ఉన్నారూ….. కాంగ్రెస్ అభ్యర్థి దనసరిఅనసూయ (సీతక్క) ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షంగానే ఉన్నారు, ప్రస్తుతం మూడోసారి పోటీపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాననే నినాదాన్ని ప్రధానంగా ఓటర్ల వద్ద ప్రస్తావిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేశానని, వరదల సమయంలో బాధితుల వద్దకు వెళ్లి అండగా నిలిచానని, మంచికి చెడుకు ఎప్పుడు ప్రజలతో మమేకమై కష్టం సుఖాలను పంచుకున్నానన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని వివరిస్తున్నారు. ములుగు నియోజకవర్గం తనకు గుండె లాంటిదని, ప్రజల కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుందని బాధపడేవారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ప్రజల గొంతుకై అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీసి ములుగు మండలంలోని మల్లంపల్లిని మండలం గా, ములుగు జిల్లా లోని ఏటూర్ నాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా; పోడు భూమి రైతులకు పట్టాలు సాధించుకున్నామని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తనకు మంత్రి పదవి రావడం జరుగుతుందన్నారు. ములుగుజిల్లాలోని ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు అందేలా చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. మాజీ మంత్రి చందులాల్ వారసుడిగా…భాజపా అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్……. తన తండ్రి దివంగత మాజీ మంత్రి అజ్మీరాచందులాల్ వారసత్వాన్ని ఆయుధంగా మార్చుకుని భాజపా అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ బిజెపిపార్టీ శ్రేణులతో కలిసి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మొదటగా భారాస టికెట్ ఆశించి భంగపడిన ఆయన భాజపాలో చేరి అలస్యంగా నైనా భాజపాఅభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని టికెట్ దక్కించుకున్నారు. ములుగు నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి చేసిన సేవలను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పల్లెల అభివృద్ధికి కేంద్రంలోని భాజాపా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ గిరిజన యూనివర్సిటీ మొదలుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దివంగత మాజీ మంత్రి చందూలాల్ హయాంలో అజ్మీరా ప్రహ్లాదుకు ములుగు నియోజకవర్గ ఇన్చార్జిగా, మార్కెట్ చైర్మన్ గా పనిచేసినప్పుడు తను చేసింది ఏమీ లేదని, ప్రజలు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తన తండ్రితో సన్నిహిత సంబంధాలు కలిగిన వారిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ చందూలాల్ వారసుడిగా ఆశీర్వదించండి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు ఆదివాసి మహిళలు కావడంతో తనకు నమ్మకంగా లంబాడా సామాజిక వర్గం ఓట్లు పూర్తిస్థాయిలో కలిసి వస్తాయనే ధీమాతో భాజాపా అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ ప్రచారంలో కొనసాగుతూ గెలుపే లక్ష్యంగా అడుగులు ముందుకేస్తున్నారు……… సంక్షేమ పథకాలే ఆయుధంగా భారాస అభ్యర్థి బడే నాగజ్యోతి భారాస అభ్యర్థి బడే నాగజ్యోతి గతంలో తన స్వగ్రామమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం, కాల్వపల్లి. ఆ గ్రామ సర్పంచి తాడ్వాయి జడ్పిటిసి సభ్యురాలుగా, భారాస నుంచి గెలిచి జడ్పీ వైస్ చైర్ పర్సన్ గా, ప్రస్తుతం తాత్కాలిక జెడ్పి చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మూడేళ్ల వ్యవధిలోనే ఆమెకు ఊహించిన రీతిలో పదవులు వరించాయి. ప్రజల కోసం తన తండ్రి బడే ప్రభాకర్ రావు@ నాగేశ్వరరావు నక్సల్స్ ఉద్యమంలోపోరాటం చేసి ప్రాణాలు అర్పించారని, తనకు తల్లిదండ్రులు లేరని అన్ని నియోజకవర్గ ప్రజలేనని తెలుపుతూ, కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధంగా మలుచుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ధీమాతో ముందుకు సాగుతున్నారు పార్టీ ఆదేశాల మేరకు ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా రెడ్ కో చైర్మన్ ఏరువా సతీష్ రెడ్డి బడే నాగజ్యోతి గెలుపుకు ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఇతర పార్టీల నుంచి బారాసలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.
ములుగు జిల్లా ప్రతినిధి, నవంబర్20(భారతశక్తి) : ములుగు నియోజకవర్గం లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతుంది ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముఖాముఖి పోటీనే ఉండేది, ప్రస్తుతం నవంబర్ 30న జరిగే ములుగు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనసరి సీతక్క, భాజాపా అభ్యర్థి అజ్మీరా ప్రహ్లద్; భారాస అభ్యర్థి బడే నాగజ్యోతి లమధ్య పోరుకొనసాగుతుంది. ప్రజాసేవా, వారసత్వమా, సంక్షేమ పథకాల,నువ్వా నేనా… అనే విధంగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
గిరిజనులు గిరిజన నేతరులు గిరిజనుల్లో ఆదివాసి లంబాడా అనే ప్రధాన అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయా, గిరిజన ఓట్ల కంటే నియోజకవర్గంలో గిరిజన నేతరుల ఓట్లు అధికంగా ఉంటాయి వీరు ఎవరికీ మద్దతిస్తారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భారాస, కాంగ్రెస్ నుంచి ఆదివాసి గిరిజన సామాజిక వర్గం, భాజపా నుంచి లంబాడ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఈ సామాజిక వర్గాలు ఎవరిని ఆదరిస్తాయనేది కూడా ప్రధానంగాచర్చనీయాంశమైంది.
సీతక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా
ప్రతిపక్షంగానే ఉన్నారూ…..
వంద రోజుల్లోనే అమలు చేస్తామని వివరిస్తున్నారు. ములుగు నియోజకవర్గం తనకు గుండె లాంటిదని, ప్రజల కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుందని బాధపడేవారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ప్రజల గొంతుకై అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీసి ములుగు మండలంలోని మల్లంపల్లిని మండలం గా, ములుగు జిల్లా లోని ఏటూర్ నాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా; పోడు భూమి రైతులకు పట్టాలు సాధించుకున్నామని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తనకు మంత్రి పదవి రావడం జరుగుతుందన్నారు. ములుగుజిల్లాలోని ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు అందేలా చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.
మాజీ మంత్రి చందులాల్ వారసుడిగా…భాజపా అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్…….
సంక్షేమ పథకాలే ఆయుధంగా భారాస అభ్యర్థి బడే నాగజ్యోతి
భారాస అభ్యర్థి బడే నాగజ్యోతి గతంలో తన స్వగ్రామమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం, కాల్వపల్లి. ఆ గ్రామ సర్పంచి తాడ్వాయి జడ్పిటిసి సభ్యురాలుగా, భారాస నుంచి గెలిచి జడ్పీ వైస్ చైర్ పర్సన్ గా, ప్రస్తుతం తాత్కాలిక జెడ్పి చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మూడేళ్ల వ్యవధిలోనే ఆమెకు ఊహించిన రీతిలో పదవులు వరించాయి. ప్రజల కోసం తన తండ్రి బడే ప్రభాకర్ రావు@ నాగేశ్వరరావు నక్సల్స్ ఉద్యమంలోపోరాటం చేసి ప్రాణాలు అర్పించారని, తనకు తల్లిదండ్రులు లేరని అన్ని నియోజకవర్గ ప్రజలేనని తెలుపుతూ, కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధంగా మలుచుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ధీమాతో ముందుకు సాగుతున్నారు పార్టీ ఆదేశాల మేరకు ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా రెడ్ కో చైర్మన్ ఏరువా సతీష్ రెడ్డి బడే నాగజ్యోతి గెలుపుకు ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఇతర పార్టీల నుంచి బారాసలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.
