గ్రేటర్ హైదరాబాద్ వీరశైవ లింగాయత్ బలిజ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వాలే శెట్టి క్రాంతి నియామకం

గ్రేటర్ హైదరాబాద్ వీరశైవ లింగాయత్ బలిజ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వాలే శెట్టి క్రాంతి నియామకం

పటాన్చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణానికి చెందిన  వాలే శెట్టి క్రాంతి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు సంగమేశ్వర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన సంగం రాష్ట్ర అధ్యక్షుడు దినేష్ పాటిల్, ప్రధాన కార్యదర్శి రాజప్ప, సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివకుమార్ లకు ఈ సందర్భంగా క్రాంతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీరశైవ లింగాయత్ సమాజ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని క్రాంతి స్పష్టం చేశారు.

About The Author

Related Posts