వీరభద్ర ఐటిఐలో ఘనంగా స్నాతకోత్సవం
గుమ్మడిదల

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో స్థానిక వీరభద్ర ఐటిఐ కాలేజీలో సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్ పంపిణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గుమ్మడిదల మండల ఎంపీడీవో ఉమాదేవి ముఖ్యఅతిధిగా విచ్చేశారు.ప్రధాన వక్తగా శ్రీ కళింగ కృష్ణ కుమార్ (జిన్నారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ) మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకువాలని, జీవితంలో ఉన్నతమైన లక్షాలను చేరుకోవాలని అన్నారు. విశిష్ట అతిధులుగా శ్రీ వివేకానంద హై స్కూల్ కరెస్పాండెంట్ జైపాల్ రెడ్డి,శ్రీ వత్సవ లైఫ్ సైన్స్ కంపెనీ ఎండి సత్యనారాయణ, పంచాయితీ కార్యదర్శి సురేష్ ,కాలేజీ డైరెక్టర్ యాదగిరి , ప్రిన్సిపాల్ శ్రీకాంత్ , లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
16 Apr 2026
