అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలి 18ఒప్పందాలు చేస్తే 10పనులు పూర్తయ్యాయి మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు
కరీంనగర్, జనవరి 30(భారత శక్తి) రాష్ట్ర అభివృద్ది కోసం ఒక ప్రణాళిక బద్ధంగా మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతావుంటే, అభివృద్ధిని ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. గురువారం సాయంత్రం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం 18 పనులకు ఒప్పందాలు చేసుకుంటే 10 పనుకు 50 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. అందుకేప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి చేస్తా అంటే కావాలని ఉనికి కోసం ఇతర పార్టీలు రాద్ధాంతం చేసున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నిలుపుతమని స్పష్టం చేశారు. కరీంనగర్ నూతనంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభం అయిందని, ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్, జనవరి 30(భారత శక్తి)
రాష్ట్ర అభివృద్ది కోసం ఒక ప్రణాళిక బద్ధంగా మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతావుంటే, అభివృద్ధిని ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. గురువారం సాయంత్రం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం 18 పనులకు ఒప్పందాలు చేసుకుంటే 10 పనుకు 50 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. అందుకేప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి చేస్తా అంటే కావాలని ఉనికి కోసం ఇతర పార్టీలు రాద్ధాంతం చేసున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నిలుపుతమని స్పష్టం చేశారు. కరీంనగర్ నూతనంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభం అయిందని, ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
