24న ఎక్స్‌పీరియమ్ పార్క్‌లో ‘తాటి మ్యూజిక్ మేళా’
- గీత వృత్తికి పూర్వవైభవం రావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- రామదేవ్ రావును కలిసిన ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ అధ్యక్షుడు పెద్ది శంకర్
హైదరాబాద్:
తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన తాటి, ఈత చెట్ల రక్షణే ధ్యేయంగా ఈ నెల 24న ఎక్స్‌పీరియమ్ పార్క్ లో “తాటి (TODDY) మ్యూజిక్ మేళా” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత ఇదే..
రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత మొక్కలను పెద్ద ఎత్తున పెంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గీత కార్మికుల సంక్షేమంతో పాటు, ప్రకృతి పానీయాల ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ మేళా సాగనుంది. ఈ కార్యక్రమంలో వాసుదేవ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.
కాగా, ఎక్స్‌పీరియమ్ పార్క్ వ్యవస్థాపకులు రామదేవ్ రావును "రెడీ టు సర్వ్’ ఫౌండేషన్" వ్యవస్థాపక అధ్యక్షుడు 'పెద్ది శంకర్' మర్యాదపూర్వకంగా కలిశారు. సమాజ హితం కోసం రామదేవ్ రావు చేస్తున్న కృషిని శంకర్ కొనియాడారు. ఈ నెల 24న జరిగే మ్యూజిక్ మేళాకు రావాల్సిందిగా రామదేవ్ రావు ఆహ్వానించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, సంస్కృతిని బలోపేతం చేసేందుకు రామదేవ్ రావు చేపట్టిన ఈ ప్రయత్నం స్ఫూర్తిదాయకమని శంకర్ పేర్కొన్నారు.
About The Author
15 May 2026
