ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి.

సరూర్ నగర్ తహసీల్దార్ వేణు గోపాల్ పలు సూచనలు

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి.

ఎల్బీనగర్:

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సరూర్ నగర్ తహసీల్దార్ పి.వేణుగోపాల్ సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 2025 ఓటరు జాబితాలోని అర్హులైన ఓటర్లందరిని 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేయాలని తెలిపారు.మ్యాపింగ్ ప్రక్రియ 62 శాతమే అయిందని, మిగతా ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని పేర్కొంటూ బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి వారంలోగా మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఎల సహకారం తీసుకోవాలని, రెసిడెన్షియల్ కాలనీల్లో సమావేశాలు నిర్వహించి ప్రతి ఓటరు మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కూడా సహకరించి తమ వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు కూడా బిఎల్ఓలను కలిసి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. అనుసంధానం కాని ఓటరు పేరు జాబితా నుండి తొలగించవచ్చని తెలియచేశా

About The Author