కాలనీ సమస్యల పరిష్కారమే లక్ష్యం
- అభివృద్ధికి అండగా ఉంటా: మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
- శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ వినతి
బి.ఎన్.రెడ్డి నగర్:
కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. శ్రీరామ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా.. కమిటీ సభ్యులు శుక్రవారం లచ్చిరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అభివృద్ధి బాటలో శ్రీరామ్ నగర్
ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామ్ నగర్ కాలనీలో ఇప్పటికే 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని వివరించారు. రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రధాన పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన సమస్యలను కూడా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నూతన కమిటీ కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాము గౌడ్, ట్రెజరర్ శేఖర్, గౌరవ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పుష్పాల్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు రవీందర్ రెడ్డి, రాకేష్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కృష్ణారెడ్డి, దయానంద్ గౌడ్, అడ్వైజర్లు రంగారెడ్డి, రవీందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
15 May 2026
