IRCTC Devotional Tour Package: గంగాసాగర్ టూ కాశీ..

ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక కొత్త టూర్ ప్యాకేజీను ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో గంగాసాగర్, జగన్నాథ్, కాశీ, బైద్యనాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

IRCTC Devotional Tour Package: గంగాసాగర్ టూ కాశీ..

భారత శక్తి డెస్క్‌: 
మన ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్లు పుణ్యక్షేత్రాలను చూడాలని అనుకుంటారు. కానీ, ఖర్చులు ఎక్కువ అని ఆలోచించి చాలా మంది వెనకడుగు వేస్తారు. అయితే, కేవలం తక్కువ ఖర్చుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక కొత్త టూర్ ప్యాకేజీను ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో గంగాసాగర్, జగన్నాథ్, కాశీ, బైద్యనాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఇక, ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం..

పర్యటన తేదీలు:
సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 22 వరకు (9 రాత్రులు, 10 పగళ్లు)
ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు?
ఈ టూర్‌లో మీరు సందర్శించే ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే:
·         గయా – విష్ణుపాద్ ఆలయం
·         పూరీ – జగన్నాథ ఆలయం
·         కోణార్క్ – సూర్య దేవాలయం
·         కోల్‌కతా
·         గంగాసాగర్
·         బైద్యనాథ్ ఆలయం
·         వారణాసి – కాశీ విశ్వనాథ్ ఆలయం
·         అయోధ్య – రామాలయం, హనుమాన్‌గర్హి, సరయు హారతి

మీరు ఈ స్టేషన్లలో ఎక్కవచ్చు దిగవచ్చు
·         ఈ రైలు ఆగ్రా కాంట్ నుంచి ప్రారంభమవుతుంది.
·         ఇతర స్టేషన్లు: గ్వాలియర్, ఝాన్సీ, ఒరై, కాన్పూర్, లక్నో, అయోధ్య, వారణాసి.

బెర్తుల వివరాలు:
·         2AC – 49 సీట్లు
·         3AC – 70 సీట్లు
·         స్లీపర్ క్లాస్ – 648 సీట్లు

సౌకర్యాలు ఇవే:
·         రైలు ప్రయాణం (2AC , 3AC , స్లీపర్ క్లాస్)
·         శాఖాహార భోజనాలు (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్)
·         వాష్ అండ్ చేంజ్ సౌకర్యం
·         AC , నాన్ AC బస్సుల్లో దర్శనాలు
·         హోటల్ బస – షేరింగ్, నాన్ షేరింగ్ గదులు

ప్యాకేజీ ధరలు:
ఎకానమీ క్లాస్ (స్లీపర్ క్లాస్):
·         పెద్దలకి రూ. 18,460
·         పిల్లలకు (5–11 ఏళ్లు) రూ. 17,330

స్టాండర్డ్ క్లాస్ (3AC క్లాస్):
·         పెద్దలకి రూ 30,480
·         పిల్లలకు రూ. 29,150

కంఫర్ట్ క్లాస్ (2AC క్లాస్):
·         పెద్దలకి రూ. 40,300
·         పిల్లలకు రూ 38,700

బుకింగ్ ఎలా చేయాలి?
మీరు ఈ ప్యాకేజీని రెండు మార్గాల్లో బుక్ చేసుకోవచ్చు:
·         IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com
·         IRCTC కార్యాలయం – గోమతి నగర్, లక్నోలోని టూరిజం భవన్
ధార్మిక పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం అన్ని సౌకర్యాలతో, సరసమైన ధరలో IRCTC అందిస్తోంది. మరి ఆలస్యం ఎందుకు? ఇక లేట్ చేయకుండా ఇప్పుడే మీ తల్లిదండ్రులకు, ఇంట్లో పెద్దలకు టికెట్స్ బుక్ చేసి వారిని సర్‌ప్రైజ్ చేయండి.

About The Author

Related Posts