ముందుకు సాగని అడవిపల్లె
తిరుపతి, సెప్టెంబర్ 29 కడప జిల్లాలోని పీలేరు నియోజకర్గంలో అసంపూర్తిగా ఉన్న అడవి పల్లె ప్రాజెక్టును పట్టించుకునే నాథుడు లేడు. కేవలం రూ. 50 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ పూర్తౌె ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 మండలాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగు నీటితోపాటు తాగు నీరు అందించవచ్చు. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల కోసం ప్రజాప్రతినిధులెవరూ నోరు తెరిచి అడగలేదని ఈ ప్రాంత రైతులు విమర్శిస్తున్నారు.హంద్రీనీవా ప్రాజెక్టులో భాగం కేవీపల్లె మండలంలోని అడవిపల్లె వద్ద ప్రాజెక్ట్ ను నిర్మించి కాలువల ద్వారా సాగునీటిని అందించాలనే లక్ష్యంతో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 2006లో శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికిగాను అప్పట్లోనే రూ.84 కోట్ల నిధులు విడుదల చేశారు. 2016 నాటికి ప్రాజెక్టుతోపాటు కాలువల నిర్మాణం పూర్తయింది. అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు అడవిపల్లె ప్రాజెక్ట్ ను సందర్శించి నీటి సామర్థ్య నిల్వను మరో టీఎంసీకి పెంచి.. చిత్తూరుకు తాగు నీరు అందించాలని రూ.2 వేల కోట్ల నిధులను మంజూరు చేశారు. ప్రాజెక్ట్ నుంచి చిత్తూరుకు పైప్ లైన్ పనులు చకచకా ప్రారంభమయ్యాయి.2019 వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ఏడాది తర్వాత కాంట్రాక్టరుకు, ప్రజాప్రతినిధులకు సయోధ్య కుదరడంతో పీలేరు పట్టణానికి తాగునీరు అందించే విధంగా డిజైన మార్పులు చేశారు. అనంతరం పైప్ లైన్ పనులను ఎట్టకేలకు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు నీరు అందించే ప్రధాన కాలువ నిర్మాణ పనులు పెద్ద మద్యం మండలంలోని పులకుంట పల్లె వద్ద నిలిచిపోయాయి.పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలకు నీళ్లు అందించాలని ఆరాటపడుతున్నారేగానీ అడవిపల్లె ప్రాజెక్ట్ గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పీలేరు నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మరో 10 మండలాలకు సైతం సాగు నీరు ఇవ్వచ్చని ఇరిగేషన్ అధికారులు చెపుతున్న మాటలు నేతల చెవులకి ఎక్కటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులు కోరుతున్నారు.
తిరుపతి, సెప్టెంబర్ 29
కడప జిల్లాలోని పీలేరు నియోజకర్గంలో అసంపూర్తిగా ఉన్న అడవి పల్లె ప్రాజెక్టును పట్టించుకునే నాథుడు లేడు. కేవలం రూ. 50 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ పూర్తౌె ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 మండలాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగు నీటితోపాటు తాగు నీరు అందించవచ్చు. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల కోసం ప్రజాప్రతినిధులెవరూ నోరు తెరిచి అడగలేదని ఈ ప్రాంత రైతులు విమర్శిస్తున్నారు.హంద్రీనీవా ప్రాజెక్టులో భాగం కేవీపల్లె మండలంలోని అడవిపల్లె వద్ద ప్రాజెక్ట్ ను నిర్మించి కాలువల ద్వారా సాగునీటిని అందించాలనే లక్ష్యంతో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 2006లో శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికిగాను అప్పట్లోనే రూ.84 కోట్ల నిధులు విడుదల చేశారు. 2016 నాటికి ప్రాజెక్టుతోపాటు కాలువల నిర్మాణం పూర్తయింది. అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు అడవిపల్లె ప్రాజెక్ట్ ను సందర్శించి నీటి సామర్థ్య నిల్వను మరో టీఎంసీకి పెంచి.. చిత్తూరుకు తాగు నీరు అందించాలని రూ.2 వేల కోట్ల నిధులను మంజూరు చేశారు. ప్రాజెక్ట్ నుంచి చిత్తూరుకు పైప్ లైన్ పనులు చకచకా ప్రారంభమయ్యాయి.2019 వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ఏడాది తర్వాత కాంట్రాక్టరుకు, ప్రజాప్రతినిధులకు సయోధ్య కుదరడంతో పీలేరు పట్టణానికి తాగునీరు అందించే విధంగా డిజైన మార్పులు చేశారు. అనంతరం పైప్ లైన్ పనులను ఎట్టకేలకు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు నీరు అందించే ప్రధాన కాలువ నిర్మాణ పనులు పెద్ద మద్యం మండలంలోని పులకుంట పల్లె వద్ద నిలిచిపోయాయి.పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలకు నీళ్లు అందించాలని ఆరాటపడుతున్నారేగానీ అడవిపల్లె ప్రాజెక్ట్ గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పీలేరు నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మరో 10 మండలాలకు సైతం సాగు నీరు ఇవ్వచ్చని ఇరిగేషన్ అధికారులు చెపుతున్న మాటలు నేతల చెవులకి ఎక్కటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులు కోరుతున్నారు.
