పెండింగ్ కేసులను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

వైయస్సార్ జిల్లా, ఫిబ్రవరి 1(భారత శక్తి ): జిల్లాలోని పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని లా ఆఫీసర్స్,రెవెన్యూ అధికారుల ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని బోర్డ్ రూమ్ హాల్లో పెండింగ్ కేసులపై లా ఆఫీసర్స్ తో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు,లా ఆఫీసర్స్,ఆర్డీవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.తాహసిల్దార్ల స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసుల వెంటనే సమీక్ష చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. కేసులకు సంబంధించి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా లా ఆఫీసర్స్ తో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు.ప్రతినెల చివరి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కడప ప్రభుత్వ ప్లీడర్ శివశంకర్ రెడ్డి, ప్రొద్దుటూరు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ పవన్ కుమార్ రెడ్డి, బద్వేల్ అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ సూర్యనారాయణ రెడ్డి, మైదుకూరు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ నరసింహ శర్మ, బద్వేల్ ఆర్టీవో చంద్రమోహన్, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, జమ్మలమడుగు ఆర్డిఓ సాయిశ్రీ, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

వైయస్సార్ జిల్లా, ఫిబ్రవరి 1(భారత శక్తి ): జిల్లాలోని పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని లా ఆఫీసర్స్,రెవెన్యూ అధికారుల ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.

స్థానిక కలెక్టరేట్లోని బోర్డ్ రూమ్ హాల్లో పెండింగ్ కేసులపై లా ఆఫీసర్స్ తో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు,లా ఆఫీసర్స్,ఆర్డీవోలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.తాహసిల్దార్ల స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసుల వెంటనే సమీక్ష చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. కేసులకు సంబంధించి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా లా ఆఫీసర్స్ తో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు.ప్రతినెల చివరి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో కడప ప్రభుత్వ ప్లీడర్ శివశంకర్ రెడ్డి, ప్రొద్దుటూరు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ పవన్ కుమార్ రెడ్డి, బద్వేల్ అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ సూర్యనారాయణ రెడ్డి, మైదుకూరు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ నరసింహ శర్మ, బద్వేల్ ఆర్టీవో చంద్రమోహన్, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, జమ్మలమడుగు ఆర్డిఓ సాయిశ్రీ, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts