మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్ 

నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.

 
1000495949
 
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 25 :నిర్మల్ జిల్లా భైంసా మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్ కు తరలించారు.  ఎస్పి డాక్టర్ జానకి షర్మిల విలేకరుల సమావేశంలో  కెసుకు సంబంధించిన వివరాలను ముఖ్య కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్న ఇది వరకే ఈ కేసులో 8 మంది సహా నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. వారి యొక్క వివరాలు:
1.పులివెల్లి మణికంఠ, నిర్మల్, 2.చలమంతుల శివ చారి,నిర్మల్, 3.రెహమాన్, భైంసా. 4.లక్కాల నరేష్ ,నిర్మల్,5.కారేగం ప్రణయ్,నిర్మల్,6.చేని కళ్యాణ్,నిర్మల్,7.సయ్యద్ ఇర్ఫాన్, భైంసా ,8.చిక్కాల వెంకటేష్,నిర్మల్
ముఠా సభ్యున్ని నిర్మల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. భైంసా పట్టణానికి చెందిన సయ్యద్ ఆజమ్.ఇతను మీ సేవ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తాడు.ఇతను All pannel.com అనే బెట్టింగ్ ద్వారా ఈ కార్యకలాపాల్ని నిర్వహిస్తాడు.
 
దీనికి సంబంధించి బాధితుల వద్ద బ్యాంక్ ఖాతాలు తీసుకొని, వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సిస్ కూడా తీసుకొని, వాళ్ల ట్రాన్జక్షన్స్ అన్ని కూడా ఇతని అధీనంలో పెట్టుకుని వారికి నెలకు కొంత డబ్బులు ఇస్తాను అని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇలా బెట్టింగ్ లో వచ్చిన డబ్బులను వేరే అకౌంట్ లో వేస్తూ ఉంటాడు.
దానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ ప్రూఫ్ ల కోసం ఫేక్ సర్టిఫికెట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇన్కమ్ సర్టిఫికెట్స్ ని ఐటీ రిటర్న్స్ ఫేక్ గా క్రియేట్ చేసి ఈయన దగ్గరనే ట్రాన్సాక్షన్స్ రైట్స్ మొత్తం పెట్టుకుంటాడు.
 
ఇలా వాళ్లకి నెలకి ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు.ఇలా ఈయన ద్వారా కొంతమంది మోసపోతారు లక్షల్లో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరియు డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడం జరిగింది.
   
ఇది వరకే ఈ కేసులో ఎనిమిది మందిని రిమాండ్ కు తరలించడం జరిగింది.ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఇందులో ఇంకెవరు ఉన్నారు, వారిని కూడా త్వరగా పట్టుకోవాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పి భైంసా అవినాష్ కుమార్. నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ప్రధాన నిందితుడు బైంసా పట్టణానికి చెందిన ఇర్ఫాన్ కాగా, సయ్యద్ ఆజమ్ కూడా సహనిందితునిగా ఉన్నాడు.
 
ఈ బృందం ఓవైసీ నగర్ ప్రార్థన మందిర సమీపంలో టౌన్ సిఐ గోపీనాథ్ తో కూడిన పోలీస్ బృందం గురువారం రాత్రి మెరుపు దాడి చేసి బెట్టింగ్ నిర్వాహకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు.
 
IMG-20250822-WA0068
నిందితుని నుండి స్వాధీన పరుచుకున్న వస్తువులు:
1) 16.3 లక్షల రూపాయల నగదు
2) 384.38 గ్రాముల బంగారు ఆభరణాలు(లక్క మరియు దారం తో పాటు కలిపి)
3) 55 గ్రాముల,24 క్యారెట్లు గల మూడు బంగారు బిస్కెట్ బిల్లలు
4) ఆస్తికి సంబంధించి 21 దస్తావేజులు
5) మూడు మొబైల్ ఫోన్లు (ఇందులో ఒకటి పని చేయని ఎమ్.ఐ ఫోన్)
6) ఒక లక్ష రూపాయల విలువ చేసే రోల్ గోల్డ్ వస్తువు
7) ఎనిమిది ఏటీఎం కార్డులు
8) నిందితుని వద్ద ఉన్న బాధితుల యొక్క పాన్ మరియు ఆధార్ కార్డులు
 
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇలాంటి నేరాలకు పాల్పడితే ఎవరినీ వదలబోమని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల. హెచ్చరించారు.ప్రజలు కూడా ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాలకు లోబడకుండా జాగ్రత్త వహించాలని, ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ కేసు ను ఛేదించడంలో చాకచక్యంగా పాల్గొన్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, భైంసా ఇన్స్పెక్టర్ గోపీనాథ్, కానిస్టేబుల్స్ జె.జయవంత్ రావు, ప్రమోద్, మాణిక్ రావ్,బాలాజీ, క్రాంతి లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ప్రశంసించారు.

About The Author