అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో.. క్యాంటర్‌ ఢీకొని దంపతులు దుర్మరణం

బెంగళూరు బంధువుల గృహప్రవేశం ముగించుకుని సంతోషంగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను క్యాంటర్‌ ఢీకొనడంతో దుర్మరణం చెందిన సంఘటన నగరంలోని నైస్‌రోడ్‌ పరిధిలో చోటుచేసుకుంది. విజయనగర్‌ హొస హళ్ళికు చెందబిన బయ్యణ్ణ(55, భార్య నిర్మలా(44) లు సమీప బంధువుల గృహప్రవేశంకు వెళ్ళి వాపసు వస్తుండగా గురువారం ప్రమాదం జరిగింది. వజ్రమునీశ్వర అండర్‌బ్రిడ్జ్‌ వద్ద వస్తుండగా వెనుకవైపు నుంచి క్యాంటర్‌ వేగంగా వచ్చి ఢీకొంది. ఇరువురు కిందకు పడగా క్యాంటర్‌ వేగంగా దూసుకెళ్ళింది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్యాంటర్‌ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే ఆపి పరారీ అయ్యారు. తలఘట్టపుర ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో.. క్యాంటర్‌ ఢీకొని దంపతులు దుర్మరణం

బెంగళూరు
బంధువుల గృహప్రవేశం ముగించుకుని సంతోషంగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను క్యాంటర్‌ ఢీకొనడంతో దుర్మరణం చెందిన సంఘటన నగరంలోని నైస్‌రోడ్‌ పరిధిలో చోటుచేసుకుంది. విజయనగర్‌ హొస హళ్ళికు చెందబిన బయ్యణ్ణ(55, భార్య నిర్మలా(44) లు సమీప బంధువుల గృహప్రవేశంకు వెళ్ళి వాపసు వస్తుండగా గురువారం ప్రమాదం జరిగింది. వజ్రమునీశ్వర అండర్‌బ్రిడ్జ్‌ వద్ద వస్తుండగా వెనుకవైపు నుంచి క్యాంటర్‌ వేగంగా వచ్చి ఢీకొంది. ఇరువురు కిందకు పడగా క్యాంటర్‌ వేగంగా దూసుకెళ్ళింది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్యాంటర్‌ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే ఆపి పరారీ అయ్యారు. తలఘట్టపుర ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related Posts