కోట లో ఆగని ఆత్మహత్యలు

జైపూర్‌, సెప్టెంబర్‌ 29 రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్ధుల సూసైడ్‌ అడ్డాగా కోటా అపఖ్యాతి మూటకట్టుకుంటోంది. తాజాగా అక్కడ మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ రాలిపోయిన విద్యాకుసుమాల సంఖ్య 26కు చేరింది. అధిక ఒత్తిడి, పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోననే భయం విద్యార్ధులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. కోటాలోని ప్రైవేటు హాస్టళ్లు, పీజీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల్లో ఎలాంటి డిప్రెషన్‌ లేదా ఒత్తిడికి లోనవకుండా చూసేందుకు కోచింగ్‌ హబ్‌లు ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్నాయి. హాస్టల్‌ వార్డెన్‌లు, మెస్‌ వర్కర్లు, టిఫిన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆశ్రయిస్తున్నారు. తాజా ఆత్మహత్యల నేపథ్యంలో కోటాలో ప్రిపేర్‌ అవుతోన్న నీట్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రొటీన్‌ పరీక్షలను రెండు నెలల పాటు నిలిపివేయాలని నగరంలోని జిల్లా యంత్రాంగం ఇటీవల కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను ఆదేశించింది.నీట్‌ పరీక్షకు సిద్ధమవుతోన్న విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మరోమారు కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడిరచారు. అద్దె గదిలో ఉంటూ విద్యార్ధి నీట్‌ పరీక్షకు స్వయంగా ప్రిపేర్‌ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతీ యేట లక్షల కొద్ది విద్యార్ధులు ఇంజనీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వడానికి కోటాకు వస్తుంటారు. గడచిన ఏళ్లలో నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్‌ హబ్‌లో ఈ ఆహ్మహత్యను అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది కోటాలో 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. తాజాగా యూపీ విద్యార్థి మరణంతో ఆ సంఖ్య 26కు చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ.. కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు నానాటికి కలవరపెడుతున్నాయి.

కోట లో ఆగని ఆత్మహత్యలు

జైపూర్‌, సెప్టెంబర్‌ 29
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్ధుల సూసైడ్‌ అడ్డాగా కోటా అపఖ్యాతి మూటకట్టుకుంటోంది. తాజాగా అక్కడ మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ రాలిపోయిన విద్యాకుసుమాల సంఖ్య 26కు చేరింది. అధిక ఒత్తిడి, పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోననే భయం విద్యార్ధులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. కోటాలోని ప్రైవేటు హాస్టళ్లు, పీజీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల్లో ఎలాంటి డిప్రెషన్‌ లేదా ఒత్తిడికి లోనవకుండా చూసేందుకు కోచింగ్‌ హబ్‌లు ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్నాయి. హాస్టల్‌ వార్డెన్‌లు, మెస్‌ వర్కర్లు, టిఫిన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆశ్రయిస్తున్నారు. తాజా ఆత్మహత్యల నేపథ్యంలో కోటాలో ప్రిపేర్‌ అవుతోన్న నీట్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రొటీన్‌ పరీక్షలను రెండు నెలల పాటు నిలిపివేయాలని నగరంలోని జిల్లా యంత్రాంగం ఇటీవల కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను ఆదేశించింది.నీట్‌ పరీక్షకు సిద్ధమవుతోన్న విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మరోమారు కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడిరచారు. అద్దె గదిలో ఉంటూ విద్యార్ధి నీట్‌ పరీక్షకు స్వయంగా ప్రిపేర్‌ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతీ యేట లక్షల కొద్ది విద్యార్ధులు ఇంజనీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వడానికి కోటాకు వస్తుంటారు. గడచిన ఏళ్లలో నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్‌ హబ్‌లో ఈ ఆహ్మహత్యను అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది కోటాలో 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. తాజాగా యూపీ విద్యార్థి మరణంతో ఆ సంఖ్య 26కు చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ.. కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు నానాటికి కలవరపెడుతున్నాయి.

About The Author

Related Posts