దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు జిల్లా ప్రతినిధి, జనవరి 06 (భారత శక్తి) : ప్రజావాణి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి .హెచ్. మహేందర్ జి తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో రావాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో మొత్తం 49 వినతులు వచ్చాయి. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, సిపిఓ ప్రకాష్, డిసిఎస్ఓ షా ఫైజల్ హుసేని, డి ఎం డి సి ఎస్ ఓ రాంపతి, డి సి ఓ సర్దార్ సింగ్, ఎల్డి ఎం జయ ప్రకాష్, డి డబ్ల్యూ ఓ శిరీష, ఎలక్ట్రిసిటీ డి ఈ నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి :  కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు జిల్లా ప్రతినిధి, జనవరి 06 (భారత శక్తి) : ప్రజావాణి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్
రెవెన్యూ సి .హెచ్. మహేందర్ జి తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో రావాలని పేర్కొన్నారు.
ప్రజావాణిలో మొత్తం 49 వినతులు వచ్చాయి.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, సిపిఓ ప్రకాష్, డిసిఎస్ఓ షా ఫైజల్ హుసేని, డి ఎం డి సి ఎస్ ఓ రాంపతి, డి సి ఓ సర్దార్ సింగ్, ఎల్డి ఎం జయ ప్రకాష్,
డి డబ్ల్యూ ఓ శిరీష, ఎలక్ట్రిసిటీ డి ఈ నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts