ప్రపంచవ్యాప్తంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఒక రోజు సేవా కార్యక్రమాలు

అంతర్జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయాస్తమాన సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ వాసవి క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డాన్ టూ డస్క్ పేరిట వివిధ రకాల సేవా కార్యక్రమాలను మరో అతిథి వాసవి క్లబ్ అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గుమ్మడవెల్లి నారాయణతో కలిసి నిర్వహించారు. ఉదయం విశ్వనాథ ఆలయంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి రెడ్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో అనాధ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆనంద నిలయం ఆవరణలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు. అలాగే మాతా శిశు సంక్షేమ కేంద్రం లోని గర్భిణీ స్త్రీలకు, రోగులకు వారి బంధువులకు బ్రెడ్, పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. అలాగే మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో మానసిక వికలాంగులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు , పండ్లు , బ్రెడ్డు తో పాటు వికలాంగులకు వాకర్లను అందజేశారు . ఈ సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ వుత్తూరు రమేష్, రీజనల్ కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్ , క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాల మోహన్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిరిపురం శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నాయకులు చందూరి మహేందర్, జోన్ చైర్మన్ కాచం సతీష్ , నాగిశెట్టి జ్యోతి, కుంకుమట్టి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ, వనితా క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి, కోశాధికారి కటకం సునీత, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ , వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు కొత్త కృష్ణ , దాత కండే రాజయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంటడే ఓం నమశివాయ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయాస్తమాన సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ వాసవి క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డాన్ టూ డస్క్ పేరిట వివిధ రకాల సేవా కార్యక్రమాలను మరో అతిథి వాసవి క్లబ్ అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గుమ్మడవెల్లి నారాయణతో కలిసి నిర్వహించారు. ఉదయం విశ్వనాథ ఆలయంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి రెడ్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో అనాధ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆనంద నిలయం ఆవరణలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు.

అలాగే మాతా శిశు సంక్షేమ కేంద్రం లోని గర్భిణీ స్త్రీలకు, రోగులకు వారి బంధువులకు బ్రెడ్, పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. అలాగే మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో మానసిక వికలాంగులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు , పండ్లు , బ్రెడ్డు తో పాటు వికలాంగులకు వాకర్లను అందజేశారు . ఈ సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ వుత్తూరు రమేష్, రీజనల్ కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్ , క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాల మోహన్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిరిపురం శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నాయకులు చందూరి మహేందర్, జోన్ చైర్మన్ కాచం సతీష్ , నాగిశెట్టి జ్యోతి, కుంకుమట్టి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ, వనితా క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి, కోశాధికారి కటకం సునీత, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ , వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు కొత్త కృష్ణ , దాత కండే రాజయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంటడే ఓం నమశివాయ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts