అంతంలేని ప్రభుత్వ పెన్షనర్ల వ్యథలు..

- జీవితపు చివరి అంకంలో సైతం తప్పని కష్టాలు.. 
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఛిద్రం అవుతున్న జీవితాలు.. 
- పదవీ విరమణ చేసి ఏళ్ళు గడుస్తున్నా అందని పెన్షన్ ఇతరాలు.. 
- కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నామని వాపోతున్న వయోవృద్ధులు.. 
- సర్వీస్ లో ఉన్నంత కాలం ప్రభుత్వానికి, ప్రజలకు విశిష్ట సేవలు.. 
- శేష జీవితాన్ని సుఖంగా గడపాల్సిన వారికి ప్రభుత్వం నుంచి ఎదురుగాలి.. 
- పెన్షనర్లను ఆదుకోవడంలో విఫలం అవుతున్న అధికారులు.. 
- దాదాపు 30 ఏళ్ళు సేవచేసి, వారు అనుభవిస్తున్న జీవితం దుర్భరం.. 
- పెన్షనర్ల జీవితాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం.. 

download

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

Read More గ్రామ పంచాయతీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

జీవితమంతా కష్టపడి పనిచేసి, కుటుంబాన్ని నిలబెట్టి, సమాజానికి సేవ చేసిన వ్యక్తి పెన్షనర్.. అయితే వీరి వయస్సు పెరిగే కొద్ది అవసరాలు పెరుగుతాయి, ఆదాయం మాత్రం ఒకేఒక్క పింఛను మీదే ఆధారపడుతుంది.కానీ ఈ రోజుల్లో పెన్షనర్ల జీవితం సుఖంగా ఉందా? అంటే జవాబు లేదు.. వీరికి ప్రభుత్వాలు ఎంత వరకూ తోడుగా ఉన్నాయి? వారికి కావాల్సిన భద్రత, గౌరవం అందుతోందా? ఇవన్నీ కూడా జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహించి, తీరా పదవీ విరమణ చేసిన తరువాత తమకు రావాల్సిన వాటికోసం అదే ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సి రావడం దురదృష్టం.. ఈ విషయంపై ప్రభుత్వం, అధికారులు కల్పించుకుని పెన్షనర్ల సమస్యలపై సత్వరం స్పందించాలని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " డిమాండ్ చేస్తోంది..  
 

Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?

నేడు పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.. దేశవ్యాప్తంగా లక్షలాది పెన్షనర్లు బతుకు బండిని లాగుతున్నారు. కొందరికి పెన్షన్ వస్తున్నా, అది చాలు అనడం కష్టం.. .

Read More ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బందికి కేటాయింపు

పెరిగిన ద్రవ్యోల్బణం..  తగ్గిన పెన్షన్ విలువ :

Read More బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఒకప్పుడు సరిపడిన నెలపింఛను, ఇప్పుడు అరకొరగా మారింది. మందులు, కూరగాయలు, ప్రయాణం.. అన్నీ రెట్టింపు అయ్యాయి.. .. 
కాని పెన్షన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.. 

Read More అయ్యప్ప మహా పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

రిటైర్డ్ అయిన వారికి ఆరోగ్య సమస్యలు : 

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

వయసు పెరిగిన కొద్దీ డాక్టర్‌ దగ్గరికి వెళ్లడం పెరిగిపోతుంది. పోనీ ప్రభుత్వ దవాఖానల్లో చూపించుకుందామంటే విపరీతమైన రద్దీ.. అదీ కాకుండా సౌకర్యాల లోపం సమస్యగా మారింది..  ప్రైవేట్‌లో చికిత్సకైతే పెద్ద మొత్తాలు అవసరం అవుతాయి.. 

Read More పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి. సురేష్

పెన్షన్ ఆలస్యం : 

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

బ్యాంక్ లింక్, ఆధార్ సమస్య, జీవన ధృవీకరణలో ఫింగర్‌ ప్రీంట్ పనిచేయకపోవడం…ఇలా చిన్న చిన్న సమస్యలు పెన్షన్ రావడంలో నెలలు ఆలస్యం చేస్తాయి. దాంతో అవసరాలకోసం అధిక మొత్తంలో వడ్డీ చెల్లించి డబ్బులు అప్పు చేయవలసి వస్తుంది.. ఈ అప్పు భవిష్యత్తులో వారికి గుదిబండగా మారుతుంది.. 

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

ఒంటరితనం : 

Read More నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

కొంతమందికి కుటుంబం దూరం అవుతుంది.. పిల్లలు నగరాల్లో, విదేశాల్లో వుంటారు.. మనసుకు తోడు లేక కుంగిపోతున్నారు. పైగా విపరీతమైన ఆర్ధిక ఇబ్బందులు.. 

ప్రభుత్వ తీరుతెన్నులు : 

ప్రభుత్వాలు పెన్షనర్ల కోసం పథకాలు ప్రకతీస్తాయి.. .. కానీ సి పనిచేసే విధానం మాత్రం క్షమించరానిదానిగా ఉండిపోతోంది.. 
పథకాలు ఎన్నో ఉన్నా అమలు బలహీనంగా ఉంటోంది.. 

డిజిటల్ విధానాలు తీసుకొచ్చినా, గ్రామాల్లో ఇంకా గుర్తింపు సమస్యలు ఎదురవుతున్నాయి.. జీవన ధృవీకరణ కోసం పెద్దవారు క్యూల్లో నిలబడే పరిస్థితి ఏర్పడింది.. అధికారులు సరిగా స్పందించకపోవడం జరుగుతోంది.. పెన్షన్ రివిజన్ చాలా తక్కువగా ఉంటోంది.. 
ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతుంది. కాని పెన్షన్ రివిజన్ మాత్రం సంవత్సరాలకొకసారి మాత్రమే పెరుగుతుంది.. అదికూడా చాలా తక్కువ శాతంలో ఉంటుంది.. .

ఆరోగ్య భద్రతలో ఎన్నో లోపాలు :

సీనియర్ సిటిజన్స్‌కి ప్రత్యేక హెల్త్ స్కీమ్ ఉన్నా, ఔషధాలు, పరీక్షలలో 50శాతం వరకూ సబ్సిడీ రావడం లేదు.

తీసుకోవాల్సిన చర్యలు : 

ఇకనైనా ప్రభుత్వం, కుటుంబం, సమాజం అన్నీ కలిసి పెద్దవారికి భరోసా ఇవ్వాలి.. ప్రభుత్వం చేయాల్సినవి చాలా ఉన్నాయి..  
ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ రివిజన్ చేయాలి.. ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా పెంపు జరగాలి.. డిజిటల్ వ్యవస్థలో మార్పులు రావాల్సిన వసరం ఎంతైనా ఉంది..   జీవన ధృవీకరణ మొబైల్/ఓటీపీ ఆధారంగా కూడా ఉండాలి. బయోమెట్రిక్ అన్‌లాక్ సెంటర్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. ప్రత్యేక హెల్త్ కార్డు అందించాలి.. తక్కువ ధరలో మందులు, ఉచిత ప్రాథమిక పరీక్షలు, ప్రభుత్వ దవాఖానల్లో ఫాస్ట్-ట్రాక్ సేవలు అమలు చేయాలి.. 

పెన్షనర్ల కోసం గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఏ సమస్యైనా 7 రోజుల్లో పరిష్కారం అయ్యేలా ప్రత్యేక మండలిని నియమించాలి.. ఇక సామాజిక భద్రత కార్యక్రమాలు నిర్వహించాలి.. పెద్దవారి కోసం యాక్టివిటీ సెంటర్స్, కలిసే చోట్ల ఏర్పాట్లు జరగాలి.. .

పెన్షనర్లు పాటించాల్సిన జాగ్రత్తలు :

డాక్యుమెంట్లు అప్‌డేట్ ఉంచుకోవాలి.. లైఫ్ సర్టిఫికేట్ సమయానికి ఇవ్వాలి.. ఆరోగ్య బీమా తప్పనిసరిగా తీసుకోవాలి.. ప్రభుత్వ సబ్సిడీలు, వృద్ధాప్య సేవా పథకాలు చెక్ చేసుకోవాలి..  ఆర్థిక మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలి.. 

ఇక సమాజం పాత్ర :

సర్వస్వం ఇచ్చి పెంచిన తల్లిదండ్రులు, వృద్ధులు ఇప్పుడు మన సహాయం కోరుతున్నారు. వారిని ఒంటరిగా వదలకూడదు.. 
మృదువుగా మాట్లాడుతూ వారి మనసు తెలుసుకోవాలి.. అవసరమైనప్పుడు ఆర్థికంగా, భావోద్వేగంగా తోడు నిలవాలి

ఇక చివరగా..  పెన్షనర్ల బాధ అనేది కేవలం వారి బాధ కాదు.. అది ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందనే విషయాన్ని ధృవీకరిస్తుంది.. వారు సుఖంగా, భద్రంగా, గౌరవంగా జీవించే అవకాశం కల్పించటం అవసరం.. ప్రభుత్వం, పిల్లలు, సమాజం వీళ్లందరి బాధ్యతగా భావించాలి.. .పెన్షనర్ అంటే సాయం కోరే వృద్ధుడు మాత్రమే కాదు.. ఒకప్పుడు మన కోసం, ఈ దేశం కోసం పనిచేసిన యోధుడు అని గుర్తించండి..  వారికి సౌకర్యాలు, భద్రత, గౌరవం ఇవ్వడం మన ధర్మం. 

About The Author