జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యమా..? రైతు సంక్షేమం ముఖ్యమా..?

- రెండు రకాల వాదనలు వినిపిస్తున్న విశ్లేషకులు.. 
- ఒకటి పార్టీల భవిష్యత్తు.. మరొకటి రైతులకు భరోసా.. 
- ప్రస్తుతం ఈ రెండు ముఖ్యమే అంటున్న మేధావి వర్గం.. 
- రేవంత్ రెడ్డి ముంగిట రెండు పెను సవాళ్లు.. 
- మేధస్సుకు సంబంధించింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక..
- ప్రజా పాలన లక్షాన్ని నిలబెట్టేది సంక్షేమ కార్యక్రమాలు.. 
- ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న విపక్షాలు.. 
- స్వార్ధ ప్రయోజనాలు తప్ప, రేవంత్ కు ప్రజాప్రయోజాన్లు పట్టమంటూ విమర్శలు.. 
- నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే రాజుకున్న అగ్గి.. 
- రౌడీ షీటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారంటూ పలువురి ఫైర్.. 
- రాష్ట్రంలోని ఇతరత్రా సమస్యలను గాలికొదిలేశారన్న వ్యాఖ్యలు.. 
- మరి రేవంత్ ఎలాంటి సమాధానం చెబుతాడో అని ఎదురు చూస్తున్న ప్రజానీకం.. 
- ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న కథనం..  

download (1)

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ ) 

Read More చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయితి కార్యాలయంలో నామినేషన్స్

తెలంగాణ రాష్ట్రం ఎన్నెన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న రాష్ట్రం.. చరిత్రను తన గర్భంలో దాచుకున్న గొప్ప రాష్ట్రం.. పోరాటాలకు పుట్టినిల్లు..  సంస్క్రుతి, సాంప్రదాయాలకు నెలవైన రాష్ట్రం.. అన్ని పార్టీల ప్రభుత్వాలు ఈ గడ్డను పాలించాయి.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ విడివడ్డాక  అనేకానేక మార్పులు, మలుపులు చోటుచేసుకున్నాయి.. గతాన్ని ఒకసారి పక్కన బెట్టి ప్రస్తుత పరిస్థితులు ఒకసారి చూద్దాం..  రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.. అలాగే ఎన్నెన్నో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది..  అనుభవారాహిత్యంతో రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  అదేవిధంగా స్వపక్షంలోనే తీవ్రమైన వ్యతిరేకత పొడసూపింది.. చివరకు రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి..  కొంతమంది ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు..  ఇందులో ఎంత వాస్తవం ఉందో అన్నది ఇథమిద్దంగా విశ్లేషించలేము కానీ, రేవంత్ సర్కార్ మాత్రం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది అన్నది మాత్రం వాస్తవం..  ఇందులో ఎలాంటి సందేహం లేదు.. అయితే ప్రస్తుతం హైదరాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది..  కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కు టికెట్ లభించడం చాలామంది కాంగ్రెస్ నాయకులకు రుచించలేదు.. అయితే ఎవరిమాటా వినని మోనార్క్ అని పేరుతెచ్చుకున్న రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుని పోతున్నాడు.. ఎలాగైనా నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలి అని కంకణం కట్టుకున్నాడు..  అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో తుఫాను మూలంగా క్లిష్ట పరిస్థులు నెలకొన్నాయి..  దీంతో సహాయక చర్యలు పట్టించుకోకుండా రేవంత్ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికపై మాత్రమే దృష్టిపెట్టాడు అన్న విమర్శలు ఘాటుగానే  వినిపిస్తున్నాయి.. అయితే రేవంత్ వర్గీయులు మాత్రం ఈ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక అని, రైతులను ఆదుకునే ముఖ్యమైన కార్యక్రమం కూడా  ఉదృతంగా జరుగుతోందని వాదిస్తున్నారు.. 

Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా ఎంతో ముఖ్యమైనది అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఈ ఎన్నిక అన్ని పార్టీలకు ప్రిస్టేజ్ ఇష్యూ గా మారిపోయింది.. నిజానికి ఈ నియోజకవర్గంలో వచ్చే ఫలితం ఖచ్చితంగా మున్సిపల్ తోబాటు రాష్ట్రంలోని స్థానిక ఎన్నికలపై అత్యంత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్య పార్టీలైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని శక్తులను ఒడ్డుతున్నాయి.. కాగా ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు, లోకల్ అభివృద్ధి అంశాలైన రోడ్లు, డ్రైనేజ్, మున్సిపల్ సేవలు మరింత ప్రభావం చూపుతున్నాయి.. ఇవి ఇప్పుడు ప్రాధాన్యతో కూడుకున్న కీలకమైన అంశాలుగా  రూపుదిద్దుకున్నాయి.. 

Read More నేటి భారతం :

అసలెందుకు ఈ ఎన్నిక ఇంతటి ప్రాధాన్యత సంతరించుకుంది ? :

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

హైదరాబాద్ నగర ప్రాంతంలో రాజకీయ పరమైన స్థితిగతులను ఈ నియోజకవర్గం ద్వారా లెక్కగట్టవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..  గ్రేటర్ హైదరాబాదులో ఒక కేంద్రబిందువుగా జూబ్లీహిల్స్ నియోజకవరం నిలిచిఉంది.. గమ్మత్తు ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో.. అది ఆ పార్టీకి ఒక గుర్తింపు ఇస్తుంది.. తద్వారా 150 స్థానాలకు పైగా వున్న మునిసిపల్, అలాగే స్థానిక ఎన్నికలపై ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. 

Read More జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం !

ఈ ఎన్నిక ద్వారా పార్టీలు తమ శక్తిని పరీక్షించుకుంటున్నాయని చెప్పవచ్చు.. ఎందుకంటే నగర ప్రాంతంలోని ఓటర్ల అవగాహన ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి.. ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది.. కాగా ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రత్యేకంగా చూస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.

Read More జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

ఇక రాష్ట్రంలో రైతుల బాగోగులు కూడా ముఖ్యమే.. : 

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.. రైతులు, వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రముఖ భాగం. కనీసం ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి, భౌతిక, సామాజిక సంక్షేమం అత్యంత ముఖ్యం.. రైతు బందు లాంటి పథకాలు రైతుల పెట్టుబడులకు, వారి శ్రమను   బలోపేతం చేయడానికి రూపొందించబడ్డాయి.  తుఫాను లేదా అతిచూడని వాతావరణ పరిస్థితులు వ్యవసాయాన్ని భారీగా ప్రభావితం చేస్తాయి.. ఇది మనం చూస్తూనే ఉన్నాం.. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అవసరం.

Read More క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం

రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితి ఏంటి?

Read More ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బందికి కేటాయింపు

ఇటీవల వచ్చిన మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో సుమారు 4,47,864 ఏకరాలకు పైగా పంటలు నష్టపోయాయి. ప్రభుత్వం ప్రతి ఏకరాకు రూ.10,000 పరిహారం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది.  ఇలా చూస్తే..  రైతుల బాగోగులు, వారి పెట్టుబడులు, పంటలకు రక్షణ ఇవి రాష్ట్రానికి ఎంతో కీలకంగా ఉన్నాయి. ఖచ్చితంగా రైతులను ఆదుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం.. 

Read More మాతృదేవోభవ అనాథ శరణాలయానికి విరాళం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

తుఫాని సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?

తుఫాను కారణంగా వచ్చిన వర్షాలు, వరదలు, పంటల నష్టం, వృద్ధి చెందిన ప్రమాదాలపై ప్రభుత్వం యథాశక్తిగా స్పందిస్తోంది. ఉదాహరణకు.. సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా, నిబద్దతతో చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.. పంట నష్టం తీవ్రంగా జరిగిన  జిల్లాలపై సర్వేలు జరిపారు.. దాని ఆధారంగా పరిహారాలు కూడా ప్రకటించబడ్డాయి. 

మరీ ముఖ్యంగా.. పంట నష్టం: 10,000 రూ/ఎకరానికి పరిహారం ప్రకటించబడింది. ఇక వరి నిల్వలు వర్షాలకు, వరదలకు గురయినప్పుడు ఉంటే వేరుగా చర్యలు తీసుకోవడానికి సమాయాత్తం అవుతున్నారు.. గోడౌన్‌కు తరలింపు, మిల్‌లలో నిల్వ చేయడం మొదలైనవి చేస్తున్నారు.. వరద బాధితులకు తగిన సహాయం అందిస్తున్నారు.. 

రైతులు తమ నష్టం నమోదు చేయించుకోవాలి.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. పంటల నిల్వ , నీటిమోవు పరిస్థితుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది.. భవిష్యత్ లో వచ్చే  తుఫానుల వలన ఇంకా నష్టం జరుగకుండా ఉండటానికి చర్యలు చేపట్టారు.. అయితే ప్రజలందరూ ప్రభుత్వ పధకాల పరిధి తెలుసుకోవడం, అదనపు సాయం కోసం దరఖాస్తు చేయడం కూడా ఎంతో ముఖ్యం. ప్రజలకు ఉన్నత స్థాయి సమాచారం, మూల్యాంకనలు ప్రభుత్వ ద్వారా త్వరగా పొందడం ద్వారా నష్టం తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి సూచించారు.. 

చివరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చాలా ముఖ్యమైనది. అదే విధంగా రైతుల బాగోగులు రాష్ట్ర వ్యవస్థలో కీలక మైన ప్రక్రియలుగా ఉన్నాయి. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన ఉపకార చర్యలు తీసుకుంటోంది, పంటల నష్టం, నిల్వల రక్షణ, పరిహారాలు వంటి అంశాల్లో ముందుకు వెళ్తోంది.. కనుక ఇప్పుడు చర్చనీయాంశమైన ఈ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలుగా మారాయని చెప్పవచ్చు.. 

About The Author