నేటి భారతం :

మన విశాల భారతంలో లంచం అనేది..
మన అనుబంధాలలో అంతర్భాగం అయిపొయింది..
పుట్టుక నుంచి గిట్టుక వరకు లంచం..
ప్రతి పనికి సమర్పించాలి లంచం..
అన్ని వ్యవస్థల్లో నాటుకు పోయిన పెను భూతం..
ధనమే పరమావధిగా పని చేస్తున్న అధికార యంత్రాంగం..
నీతికి ఎప్పుడో ఇచ్చారు తిలోదకం..
అవినీతి సంపాదనకు వేసారు అగ్ర పీఠం..
మన రక్తాన్ని పీల్చి వేసే జలగల సమూహం..
మన జీవితాలను కుంగదీసే విష వలయం..
ప్రతిభావంతులకు లేదు అవకాశం..
అవినీతి పరులదే సమాజంలో రాజ్యం..
లంచంతో కొన్న కంచం ఆకలి తీర్చునా..?
లంచంతో కొన్న మంచంలో నిద్దుర పట్టునా..?
లంచగొండితనాన్ని రూపు మాపుదాం..
అవినీతి రహిత సమాజాన్ని రూపుదిద్దుదాం..
Read More కాంగ్రెస్ గెలుపు అభివృద్ధికి మలుపు
About The Author
08 Nov 2025
