నేటి భారతం :
5.jpeg)
తెలంగాణ రాష్ట్ర గీతం చేష్టలుడిగి కన్నీరు కారుస్తోంది..
తండ్రిని కోల్పోయిన తనయలా కంపించిపోతోంది..
మానవత్వం మూర్తీభవించిన కలం ఆగిపోయింది..
కుళ్ళు రాజకీయాలపై ఎలుగెత్తిన గళం మూగబోయింది..
ఉవ్వెత్తున లేచిన జన గర్జన నిశ్శబ్దమైంది..
తెలంగాణ రాష్ట్ర గీతం తన తండ్రిని కోల్పోయింది..
తెలంగాణ కవి వంశానికి ఆశనిపాతం..
ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే..
తెలంగాణ కవిపుంగవుడు అందెశ్రీ ఇకలేరు..
ఈ నిజాన్ని భరించే శక్తి కోల్పోతున్నాను..
మాయమై పోయాడమ్మా మనసున్న కవి..
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ
ఓం శాంతి శాంతి శాంతిః
About The Author
06 Dec 2025
