పోలీస్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ద లతో గణేష్ నవ రాత్రులు జరుపుకుందాం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)ఆగష్టు18:
పోలీసులు సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్దలతో గణేష్ నవ రాత్రులను జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు తెలిపారు. రాబోవు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్ధం అవుతుండడంతో ముందుగా గణేష్ నవ రాత్రి నిర్వహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పసరిగా ముందుగా పోలీసుల అనుమతి పొందాల్సి ఉంటుందని.
గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్ సైట్ https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు,ఇసుక ఏర్పాటు చేసుకోవాలి.
గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం,పేకాట అడటం,లక్కీ డ్రాలు నిర్వహించడం,అసభ్యకరమైన నృత్యాలు ఏర్పాటు,అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి,పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు,ప్లాస్టిక్ సంచులు,వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు సూచించారు.