కెప్టెన్‌గా రిషబ్ పంత్.. సౌతాఫ్రికాతో T20 సిరీస్‌ నుంచి కేఎల్ రాహుల్ ఔట్

రేపటి నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు క్రికెటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. దీంతో వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించినట్లు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ వేదికగా గురువారం (జూన్ 9) తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. విశ్రాంతి కోసం రోహిత్ శర్మ ఇప్పటికే సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో తాజాగా కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు. గాయం కారణంగా మరో ఆటగాడు కుల్దీప్ యాదవ్ కూడా టీ20 సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రాహుల్, కుల్దీప్ యాదవ్ స్థానంలో సెలెక్షన్ కమిటీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ ఆటగాళ్లిద్దరూ గాయాల నుంచి కోలుకున్న తర్వాత NCAకు రిపోర్టు చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఇషాన్ కిషన్‌తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ రెండు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గురువారం రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ నెల 12న కటక్‌లో రెండో టీ20, 14న విశాఖపట్నంలో మూడో మ్యాచ్, 17న రాజ్‌కోట్‌లో నాలుగో మ్యాచ్, 19న బెంగళూరులో ఐదో టీ20 మ్యాచ్ జరుగుతాయి. మిల్లర్‌, డికాక్ లాంటి ఆటగాళ్లతో సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 15వ సీజన్‌లో మిల్లర్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్లతో పాటు రబాడ, నోకియా, ప్రిటోరియస్‌, వాండర్‌ డసెన్‌, మార్‌క్రమ్‌ లాంటి కీలక ఆటగాళ్లు సౌతాఫ్రికా జట్టులో ఉన్నారు. పటిష్ఠంగా ఉన్న ప్రత్యర్థితో భారత్‌ ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలనే ఆత్రుతతో అభిమానులు ఉన్నారు. టీ20 సిరీస్‌కు భారత జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ – కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేశ్‌ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్‌ పటేల్, రవి బిష్నోయ్‌, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

కెప్టెన్‌గా రిషబ్ పంత్.. సౌతాఫ్రికాతో T20 సిరీస్‌ నుంచి కేఎల్ రాహుల్ ఔట్

రేపటి నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు క్రికెటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. దీంతో వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించినట్లు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ వేదికగా గురువారం (జూన్ 9) తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది.

విశ్రాంతి కోసం రోహిత్ శర్మ ఇప్పటికే సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో తాజాగా కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు. గాయం కారణంగా మరో ఆటగాడు కుల్దీప్ యాదవ్ కూడా టీ20 సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

రాహుల్, కుల్దీప్ యాదవ్ స్థానంలో సెలెక్షన్ కమిటీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ ఆటగాళ్లిద్దరూ గాయాల నుంచి కోలుకున్న తర్వాత NCAకు రిపోర్టు చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఇషాన్ కిషన్‌తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ రెండు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గురువారం రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ నెల 12న కటక్‌లో రెండో టీ20, 14న విశాఖపట్నంలో మూడో మ్యాచ్, 17న రాజ్‌కోట్‌లో నాలుగో మ్యాచ్, 19న బెంగళూరులో ఐదో టీ20 మ్యాచ్ జరుగుతాయి.

మిల్లర్‌, డికాక్ లాంటి ఆటగాళ్లతో సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 15వ సీజన్‌లో మిల్లర్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్లతో పాటు రబాడ, నోకియా, ప్రిటోరియస్‌, వాండర్‌ డసెన్‌, మార్‌క్రమ్‌ లాంటి కీలక ఆటగాళ్లు సౌతాఫ్రికా జట్టులో ఉన్నారు. పటిష్ఠంగా ఉన్న ప్రత్యర్థితో భారత్‌ ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలనే ఆత్రుతతో అభిమానులు ఉన్నారు.

టీ20 సిరీస్‌కు భారత జట్టు:
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ – కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేశ్‌ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్‌ పటేల్, రవి బిష్నోయ్‌, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

About The Author

Related Posts