పసిడి పోరుకు సాకేత్‌ జోడీ

హాంగ్జౌ: ఆసియా క్రీడల టెన్ని్‌సలో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. తెలుగు క్రీడాకారుడు సాకేత్‌ మైనేని, చెన్నైకి చెందిన రామ్‌కుమార్‌ డబుల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరగా.. రోహన్‌ బోపన్న, రుతుజా భోసాలేతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీ్‌సలో రెండో సీడ్‌ సాకేత్‌-రామ్‌ జంట 6-1, 6-7(8), 10-0తో కొరియా జోడీ సెంగ్‌చాన్‌-సూన్‌వూను ఓడించింది. మిక్స్‌డ్‌లో బోపన్న జంట 7-5, 6-3తో జిబెక్‌-గ్రిగోరి (కజకిస్థాన్‌) ద్వయంపై గెలిచింది. స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం: స్క్వాష్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి రెండు పతకాలను ఖరారు చేశాయి. బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌లో క్వార్టర్స్‌కు..: బ్యాడ్మింటన్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో పీవీ సింధు సారథ్యంలోని భారత జట్టు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. ప్రీక్వార్టర్స్‌లో భారత్‌ 3-0తో మంగోలియాను ఓడించింది. ఛెత్రి సేన ఇంటికి: ఫుట్‌బాల్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో సునీల్‌ ఛెత్రి కెప్టెన్సీలోని భారత జట్టు 0-2తో సౌదీ అరేబియా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీటీ ప్రీక్వార్టర్స్‌కు శరత్‌, మనికా: టేబుల్‌ టెన్నిస్‌ వ్యక్తిగత ఈవెంట్లలో శరత్‌ కమల్‌, మనికా బాత్రా, సాథియాన్‌ ప్రీక్వార్టర్స్‌ చేరారు. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, దియా జతగా మహిళల డబుల్స్‌లో ప్రీక్వార్టర్స్‌ చేరింది. బాక్సింగ్‌ క్వార్టర్స్‌లో నిషాంత్‌, జాస్మిన్‌: బాక్సింగ్‌లో నిషాంత్‌ (71 కి), జాస్మిన్‌ (60 కి) క్వార్టర్‌ఫైనల్స్‌ చేరారు. పురుషుల హాకీలో హ్యాట్రిక్‌ విన్‌: పురుషుల హాకీలో భారత జట్టు 4-2తో జపాన్‌ను చిత్తుచేసి పూల్‌-ఎలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. దీంతో భారత్‌ సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. నేటి భారత్‌ షెడ్యూల్‌ గోల్ఫ్‌ (ఉ. 4): అనిర్బన్‌, చౌరాసియా, శుభాంకర్‌, ఖాలిన్‌, అదితి అశోక్‌, ప్రణవి శరత్‌, అవని ప్రశాంత్‌; అథ్లెటిక్స్‌ (ఉ. 4.30 నుంచి): 20 కి.మీ రేస్‌వాక్‌-సందీప్‌, వికాస్‌, ప్రియాంక, 400 మీ. హీట్స్‌-ఐశ్వర్య మిశ్రా, హిమాన్షి, మహ్మద్‌ అనాస్‌, అజ్మల్‌, మహిళల హ్యామర్‌ త్రో- రచనా కుమారి, తాన్యా చౌదరి, మహిళల షాట్‌పుట్‌-కిరణ్‌ బలియాన్‌, మన్‌ప్రీత్‌ కౌర్‌; షూటింగ్‌ (ఉ. 6.30 నుంచి): పురుషుల 50 మీ. రైఫిల్‌3 వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్లు- ఐశ్వరీ ప్రతాప్‌, స్వప్నిల్‌, అఖిల్‌, మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, టీమ్‌ఈవెంట్లు: ఇషాసింగ్‌, దివ్య, పాలక్‌; బ్యాడ్మింటన్‌ (ఉ. 5.గంటల నుంచి) పురుషుల టీమ్‌ క్వార్టర్స్‌: భారత్‌-నేపాల్‌, మహిళల టీమ్‌ క్వార్టర్స్‌ :భారత్‌-థాయ్‌లాండ్‌; స్విమ్మింగ్‌ (ఉ. 7.30): పలు విభాగాల హీట్స్‌; టెన్నిస్‌ (ఉ. 7.30 నుంచి): పురుషుల డబుల్స్‌ ఫైనల్‌- సాకేత్‌/రామ్‌కుమార్‌, మిక్స్‌డ్‌ సెమీఫైనల్‌ – బోపన్న/రుతుజ; టేబుల్‌ టెన్నిస్‌ (ఉ. 8.15 నుంచి): మహిళల సింగిల్స్‌-మనికా బత్రా, పురుషుల డబుల్స్‌- మానుష్‌ షా/మానవ్‌ టక్కర్‌, శరత్‌/సాథియాన్‌, మహిళల డబుల్స్‌- శ్రీజ/దియా, సుతీర్థ/అహిక, పురుషుల సింగిల్స్‌- శరత్‌ కమల్‌, సాథియాన్‌; స్క్వాష్‌ (ఉ. 8.30 నుంచి): మహిళల, పురుషుల టీమ్‌ సెమీస్‌; బాక్సింగ్‌ (మ. 12 నుంచి): ప్రవీణ్‌ హుడా, లక్ష్య చాహర్‌, నిఖత్‌ జరీన్‌; మహిళల హాకీ (సా. 4): భారత్‌ – మలేసియా.

పసిడి పోరుకు సాకేత్‌ జోడీ

హాంగ్జౌ: ఆసియా క్రీడల టెన్ని్‌సలో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. తెలుగు క్రీడాకారుడు సాకేత్‌ మైనేని, చెన్నైకి చెందిన రామ్‌కుమార్‌ డబుల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరగా.. రోహన్‌ బోపన్న, రుతుజా భోసాలేతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీ్‌సలో రెండో సీడ్‌ సాకేత్‌-రామ్‌ జంట 6-1, 6-7(8), 10-0తో కొరియా జోడీ సెంగ్‌చాన్‌-సూన్‌వూను ఓడించింది. మిక్స్‌డ్‌లో బోపన్న జంట 7-5, 6-3తో జిబెక్‌-గ్రిగోరి (కజకిస్థాన్‌) ద్వయంపై గెలిచింది.

స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం: స్క్వాష్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి రెండు పతకాలను ఖరారు చేశాయి.

బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌లో క్వార్టర్స్‌కు..: బ్యాడ్మింటన్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో పీవీ సింధు సారథ్యంలోని భారత జట్టు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. ప్రీక్వార్టర్స్‌లో భారత్‌ 3-0తో మంగోలియాను ఓడించింది.

ఛెత్రి సేన ఇంటికి: ఫుట్‌బాల్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో సునీల్‌ ఛెత్రి కెప్టెన్సీలోని భారత జట్టు 0-2తో సౌదీ అరేబియా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టీటీ ప్రీక్వార్టర్స్‌కు శరత్‌, మనికా: టేబుల్‌ టెన్నిస్‌ వ్యక్తిగత ఈవెంట్లలో శరత్‌ కమల్‌, మనికా బాత్రా, సాథియాన్‌ ప్రీక్వార్టర్స్‌ చేరారు. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, దియా జతగా మహిళల డబుల్స్‌లో ప్రీక్వార్టర్స్‌ చేరింది.

బాక్సింగ్‌ క్వార్టర్స్‌లో నిషాంత్‌, జాస్మిన్‌: బాక్సింగ్‌లో నిషాంత్‌ (71 కి), జాస్మిన్‌ (60 కి) క్వార్టర్‌ఫైనల్స్‌ చేరారు.

పురుషుల హాకీలో హ్యాట్రిక్‌ విన్‌: పురుషుల హాకీలో భారత జట్టు 4-2తో జపాన్‌ను చిత్తుచేసి పూల్‌-ఎలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. దీంతో భారత్‌ సెమీఫైనల్‌కు మరింత చేరువైంది.

నేటి భారత్‌ షెడ్యూల్‌

గోల్ఫ్‌ (ఉ. 4): అనిర్బన్‌, చౌరాసియా, శుభాంకర్‌, ఖాలిన్‌, అదితి అశోక్‌, ప్రణవి శరత్‌, అవని ప్రశాంత్‌; అథ్లెటిక్స్‌ (ఉ. 4.30 నుంచి): 20 కి.మీ రేస్‌వాక్‌-సందీప్‌, వికాస్‌, ప్రియాంక, 400 మీ. హీట్స్‌-ఐశ్వర్య మిశ్రా, హిమాన్షి, మహ్మద్‌ అనాస్‌, అజ్మల్‌, మహిళల హ్యామర్‌ త్రో- రచనా కుమారి, తాన్యా చౌదరి, మహిళల షాట్‌పుట్‌-కిరణ్‌ బలియాన్‌, మన్‌ప్రీత్‌ కౌర్‌; షూటింగ్‌ (ఉ. 6.30 నుంచి): పురుషుల 50 మీ. రైఫిల్‌3 వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్లు- ఐశ్వరీ ప్రతాప్‌, స్వప్నిల్‌, అఖిల్‌, మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, టీమ్‌ఈవెంట్లు: ఇషాసింగ్‌, దివ్య, పాలక్‌; బ్యాడ్మింటన్‌ (ఉ. 5.గంటల నుంచి) పురుషుల టీమ్‌ క్వార్టర్స్‌: భారత్‌-నేపాల్‌, మహిళల టీమ్‌ క్వార్టర్స్‌ :భారత్‌-థాయ్‌లాండ్‌; స్విమ్మింగ్‌ (ఉ. 7.30): పలు విభాగాల హీట్స్‌; టెన్నిస్‌ (ఉ. 7.30 నుంచి): పురుషుల డబుల్స్‌ ఫైనల్‌- సాకేత్‌/రామ్‌కుమార్‌, మిక్స్‌డ్‌ సెమీఫైనల్‌ – బోపన్న/రుతుజ; టేబుల్‌ టెన్నిస్‌ (ఉ. 8.15 నుంచి): మహిళల సింగిల్స్‌-మనికా బత్రా, పురుషుల డబుల్స్‌- మానుష్‌ షా/మానవ్‌ టక్కర్‌, శరత్‌/సాథియాన్‌, మహిళల డబుల్స్‌- శ్రీజ/దియా, సుతీర్థ/అహిక, పురుషుల సింగిల్స్‌- శరత్‌ కమల్‌, సాథియాన్‌; స్క్వాష్‌ (ఉ. 8.30 నుంచి): మహిళల, పురుషుల టీమ్‌ సెమీస్‌; బాక్సింగ్‌ (మ. 12 నుంచి): ప్రవీణ్‌ హుడా, లక్ష్య చాహర్‌, నిఖత్‌ జరీన్‌; మహిళల హాకీ (సా. 4): భారత్‌ – మలేసియా.

About The Author

Related Posts