న్యాయవాదుల రక్షణ చట్టం”కు బాండ్ పేపర్ రాసివ్వాలి: బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 5(భారత్ శక్తి): ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, దీర్ఘకాలంగా పెండింలో ఉన్న న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, అలాగే “న్యాయవాదుల రక్షణ చట్టం” తెస్తామని హామీ ఇస్తూ బాండ్ పేపర్ రాసిచ్చే అభ్యర్థికే న్యాయవాదుల ఓట్లు పడుతాయని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి అభ్యర్థులను డిమాండ్ చేసారు. నిత్యం ఏదో ఒక చోట న్యాయవాదుల పై దాడులు, హత్యలు జరుగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే “అడ్వకేట్స్ ప్రొటెక్చన్ ఆక్ట్” ను తక్షణమే తీసుకురావాలని మహేందర్ రెడ్డి కోరారు. అలాగే ఉపాధ్యాయుల కోసం టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నట్టు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉన్నట్టు, చట్ట సభల్లో చట్టాల పై పూర్తి ఆవగాహన ఉన్న న్యాయవాదులకు కూడా న్యాయవాదుల ఎమ్మెల్సీని స్థానాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు దీని పై ఎమ్మెల్సీ అభ్యర్థులు గళం విప్పాలని డిమాండ్ చేసారు. ఆర్థికంగా వెనుకబడి కొత్తగా ప్రాక్టీస్ కు వచ్చే జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్ పదివేల రూపాయిలు ఇచ్చే విధంగా, అలాగే జూనియర్ న్యాయవాదులకు ఆఫీస్ లు పెట్టుకునేందుకు బ్యాంకులు లోన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఖర్చులతో జూనియర్ న్యాయవాదులకు చట్టాల పై ఆవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్ లు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వీటితో పాటు న్యాయవాది మరణిస్తే ఇప్పుడున్న వెల్ఫేర్ ఫండ్ ఆరు లక్షల రూపాయలను ఇరవై లక్షలకు పెంచాలని, దీనికి ప్రభుత్వం వేయి కోట్ల నిధులు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కు కేటాయించాలని, అలాగే న్యాయవాదులకు గృహ సముదాయం ఉండేలా “రాష్ట్ర అడ్వకేట్స్ హోసింగ్ సొసైటీ” ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో అడ్వకేట్స్ కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి న్యాయవాదులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు పనుల కోసం వెళ్లేవారికి అక్కడి వసతి ఉండేలా “అడ్వకేట్స్ గెస్ట్ హౌస్” ను ఏర్పాటు చేయాలని, అలాగే న్యాయవాదులకు ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్సు ను రెండు లక్షల రూపాయల నుండి ఇరవై లక్షలకు పెంచడమే కాకుండా న్యాయవాదుల తల్లితండ్రులను కూడా ఈ పాలసీ క్రిందకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని హంగులతో మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వమే ప్రత్యేక నిధిని గా ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు గళం విప్పి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంకు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి న్యాయవాదుల సమస్యల పై పోరాడాలని ఎమ్మెల్సీ అభ్యర్థులను కోరారు.

న్యాయవాదుల రక్షణ చట్టం”కు బాండ్ పేపర్ రాసివ్వాలి: బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 5(భారత్ శక్తి):
ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, దీర్ఘకాలంగా పెండింలో ఉన్న న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, అలాగే “న్యాయవాదుల రక్షణ చట్టం” తెస్తామని హామీ ఇస్తూ బాండ్ పేపర్ రాసిచ్చే అభ్యర్థికే న్యాయవాదుల ఓట్లు పడుతాయని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి అభ్యర్థులను డిమాండ్ చేసారు. నిత్యం ఏదో ఒక చోట న్యాయవాదుల పై దాడులు, హత్యలు జరుగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే “అడ్వకేట్స్ ప్రొటెక్చన్ ఆక్ట్” ను తక్షణమే తీసుకురావాలని మహేందర్ రెడ్డి కోరారు. అలాగే ఉపాధ్యాయుల కోసం టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నట్టు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉన్నట్టు, చట్ట సభల్లో చట్టాల పై పూర్తి ఆవగాహన ఉన్న న్యాయవాదులకు కూడా న్యాయవాదుల ఎమ్మెల్సీని స్థానాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు దీని పై ఎమ్మెల్సీ అభ్యర్థులు గళం విప్పాలని డిమాండ్ చేసారు. ఆర్థికంగా వెనుకబడి కొత్తగా ప్రాక్టీస్ కు వచ్చే జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్ పదివేల రూపాయిలు ఇచ్చే విధంగా, అలాగే జూనియర్ న్యాయవాదులకు ఆఫీస్ లు పెట్టుకునేందుకు బ్యాంకులు లోన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఖర్చులతో జూనియర్ న్యాయవాదులకు చట్టాల పై ఆవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్ లు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వీటితో పాటు న్యాయవాది మరణిస్తే ఇప్పుడున్న వెల్ఫేర్ ఫండ్ ఆరు లక్షల రూపాయలను ఇరవై లక్షలకు పెంచాలని, దీనికి ప్రభుత్వం వేయి కోట్ల నిధులు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కు కేటాయించాలని, అలాగే న్యాయవాదులకు గృహ సముదాయం ఉండేలా “రాష్ట్ర అడ్వకేట్స్ హోసింగ్ సొసైటీ” ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో అడ్వకేట్స్ కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి న్యాయవాదులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు పనుల కోసం వెళ్లేవారికి అక్కడి వసతి ఉండేలా “అడ్వకేట్స్ గెస్ట్ హౌస్” ను ఏర్పాటు చేయాలని, అలాగే న్యాయవాదులకు ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్సు ను రెండు లక్షల రూపాయల నుండి ఇరవై లక్షలకు పెంచడమే కాకుండా న్యాయవాదుల తల్లితండ్రులను కూడా ఈ పాలసీ క్రిందకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని హంగులతో మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వమే ప్రత్యేక నిధిని గా ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు గళం విప్పి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంకు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి న్యాయవాదుల సమస్యల పై పోరాడాలని ఎమ్మెల్సీ అభ్యర్థులను కోరారు.

About The Author