అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి :
:
సంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ నుంచి రెండు కోట్ల నిధులు మంజూరైనాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంజూరైన నిధుల కేటాయింపులకు సంబంధించిన పనులను వివరించారు. రాజంపేట నుంచి ఈద్గా వరకు సిసి రోడ్డు నిర్మాణం, ఫిల్టర్ బెడ్, కాంపౌండ్ వాల్ సిసి వాచ్మెన్ లైటింగ్ ఏర్పాట్లకు ఈ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ పనులకు సంబంధించి ఇటీవలే సమీక్ష చేయడం జరిగిందన్నారు. రాజంపేట ఎక్స్ రోడ్డు నుంచి ఫిల్టర్ బెడ్ మీదుగా ఈద్గా రోడ్డు పూర్తిగా శిథిలమైందని వర్షాలతో బురదమయంగా మారుతుందని నడవడానికి వీల్ లేకుండా పోయిందని అధికారుల దృష్టికి తీసుకువచ్చిన విషయం గుర్తు చేశారు. స్థానికుల ఇబ్బందులను తెలుసుకొని హెచ్ఎండిఏ నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. అధికారుల సమన్వయంతో తయారుచేసిన ప్రతిపాదనలను టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డికి విన్నవించగా హెచ్ఎండిఏ అధికారులతో మాట్లాడి రెండు కోట్ల నిధులు విడుదల చేసేందుకు సహకరించిందని పేర్కొన్నారు. త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు.
