గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఎన్ హెచ్ 167 పై అఖిలపక్షం ధర్నా..
సూర్యాపేట జిల్లా బ్యూరో( భారత శక్తి) జూలై 30: కీతవారిగూడెం గ్రామ శివారులో గడ శ్రీనివాస స్టోన్ క్రషర్ మిల్లు నుండి రాత్రి సమయంలో క్రషర్ మిల్లు నుంచి వచ్చే అతి భారీ శబ్దాలతో దాని నుండి వెలువడే విషవాయువులతో ఊపిరాడకుండా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.గత రెండు సంవత్సరముల నుండి క్రషర్ మిల్లు కెపాసిటీ పెంచి,, దానికి కావలసిన రాయిని సేకరించుట కొరకు ఎక్కువ మోతాదులలో పేలుడు పదార్థాలు తెచ్చి, బ్లాస్టింగ్ స్థాయిలను పెంచడం వలన చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు భూసారములు కోల్పోయి, వ్యవసాయ బోర్లు పూడిపోయి రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నిసార్లు యాజమాన్యులకు విన్నవించుకున్న ఏమాత్రం లెక్కపెట్టకుండా జూలై 26న సాయంత్రం 7.30 నిమిషాలకు అతిపెద్ద భారీ శబ్దంతో కూడిన బ్లాస్టు చేయడం జరుగుట వలన ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం, పేలిన పది నిమిషములకు ఊరు చుట్టూ ఒక రకమైన దుర్వాసనతో విషవాయువులు కమ్ముట వలన ప్రజలు ఊపిరి పీల్చుకోవడము ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై గ్రామ పెద్దలు,వివిధ పార్టీల నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ విషయమై మండల రెవెన్యూ అధికారి మరియు ఎస్ఐవెంటనే స్పందించి పరిశీలించినా కూడా మరుసటి రోజు జూలై 28 న సాయంత్రం ఏడు గంటలకు యధావిధిగా బ్లాస్టింగ్ చేయడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకొనుటకు బుధవారం గరిడేపల్లి మండలం కీతవారిగూడెం ఎన్ హెచ్ 167 రోడ్డుపై గ్రామ ప్రజలు, అఖిలపక్షం పార్టీల నాయకులు ధర్నా చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తుమ్మల సైదయ్య, సుందరీ వీర రాఘవయ్య, మామిడి వెంకటేశ్వర్లు, కీతా రామారావు, ఎన్ చిట్టిబాబు, బొల్లెపల్లి శ్రీనివాస్, బొమ్మకంటి వెంకయ్య, ఎల్లావుల నారాయణ. ఆవుల సైదులు, ఇండ్ల వెంకటేష్, జంగయ్య పెండెం ధన మూర్తి జుట్టుకొండ శ్రీను,జుట్టుకొండ చిన్నబ్బయి,కీత నాగరాజు తెలపాటి నరేష్, పెండెం దనమూర్తి, ముతనేని సంజయ్ బాబు,సుంకరి మోహన్ రావు,అమర్ గాని బక్కయ్య,బండారు బిక్షం,చిన్నగాని వెంకటేష్,నర్సింగ్ బుర్రయ్య, పాలుల్లి పెద్ద ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు
About The Author
02 Aug 2025