కామ్రేడ్ పూనం లింగన్న పోరాట స్ఫూర్తితో ఉద్యమాలను ఉదృతం చేస్తాం..

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 31:కామ్రేడ్ పూనెం లింగన్న ఆరో వర్ధంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్  లింగన్న నిరుపేద కుటుంబంలో జన్మించి పేద ప్రజల విముక్తి కోసం పోరుబాటలో ఒరిగిన పోరాట యోధుడని కొనియాడినారు.నేడు కేంద్రంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వాలు మతం,కులం పేరుతో ప్రజలను విడదీస్తున్నారు.ప్రజా సమస్యలు పరిష్కరించమని అడిగితే దేశద్రోహులని అర్బన్ నక్సలైట్లని ముద్రలు వేసిఎదురు కాల్పుల పేరుతో చంపి వేస్తు,ప్రజల జీవించే హక్కును హరించి వేస్తున్నారని, ఆదివాసుల హసనాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు.1000003191
 
ప్రతి వస్తువుపై పన్నుల భారం వేయటం వలన మధ్యతరగతి నిరుపేదలందరూ అర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు.కామ్రేడ్ లింగన్న ఆశయాలతో, ఉద్యమ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను నిర్మిద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న,పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పిడిఎస్యు  రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య,టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, వాస పల్లయ్య, సయ్యద్ హుస్సేన్,గులాం హుస్సేన్, మోహన్,వెంకన్న, యాదగిరి,కరుణాకర్, పిఓడబ్ల్యూ నాయకులు పావని,శ్యామల తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 

About The Author