దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనుల పరిశీలన
కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి .
హయత్నగర్ (భారత శక్తి)జూలై 31: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి నేడు డివిజన్లోని దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను సంబంధిత సిబ్బందితో మరియు కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో కాలనీవాసులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత సిబ్బందికి వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు వెంకటనారాయణ , శ్రీనివాస్, వీరస్వామి, లింగస్వామి, శంకర్, వెంకటేష్, నగేష్, గణపతి రావు, మరియు కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు..

About The Author
02 Aug 2025