ఆధునిక పరిజ్ఞానముతో వీణా కంటి హాస్పిటల్లో నేత్ర వైద్య పరీక్షలు..
ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానంతో సునాయాసంగా కంటి పరీక్షలు చేసి తలనొప్పి కండ్ల మసకలను,కంటి జబ్బులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స చేస్తామని వీణా కంటి హాస్పిటల్ కంటి ఆప్తాల్మిక్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.గురువారం యూనివర్సిటీ పెగడపల్లి డబ్బాల ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీణ కంటి హాస్పిటల్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కంటి సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిలో భాగంగానే కంటి చూపుకు సంబంధించి సరైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు.
వయస్సు మీద పడిన వృద్ధులు,పిల్లలు,మహిళల కంటి సమస్యలను,కంటి పొర,కంటి పూత వంటి మొదలకు సమస్యలతో బాధపడుతున్న రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య చికిత్సలు చేసి నూతన పరిజ్ఞానంతో కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఏ. సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీణ ఆప్టికల్స్ యజమాని బి.రవీందర్,సిబ్బంది,బంధుమిత్రులు,తదితరులు పాల్గొన్నారు.