
సంగారెడ్డి (గుమ్మడిదల) (భారత శక్తి ప్రతినిధి)జూలై 30: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని సర్వే నెంబర్ 109 భూ సమస్యలపై,బాధిత రైతులు మాజీ మంత్రి హరీష్ రావును బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. గత 50 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్నామని, అధికారులు మాత్రం భూ పరిహారం లేదంటూ నిరాకరిస్తున్నారని వారు విన్నవించారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, తక్షణమే ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి 2013 మోక యాక్ట్ ప్రకారం న్యాయం చేయాలని అన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని, రైతుల వెన్నంటే నిలుస్తానని హామీ ఇచ్చారు.