శ్రీ సంతోషిమాత దేవాలయం లో అమ్మవారలకు వడిబియ్యం.

సూర్యాపేట జిల్లా బ్యూరో((భారతశక్తి) జూలై 31:శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయం లో శ్రీ వాసవి సేవా సమితి మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం దేవాలయంలో వేంచేసి ఉన్న మూలవిరాట్ శ్రీ మానస దేవి అమ్మవారికి, లలితా మాత లకు మహిళలు పెద్ద ఎత్తున ఒడి బియ్యం పోసి,పసుపు కుంకుమలతో సంతోషంతో ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించారు.
1000003224
ఈ సందర్భంగా అమ్మవార్లను కీర్తి స్తూ పాటలు పాడారు. శ్రీ వాసవి సేవా సమితి మహిళ సంఘం నాయకులు వీరవెల్లి ఉమ మాట్లాడుతూ ప్రతినెల ఒక రోజు సూర్యాపేటలో వేంచేసి ఉన్న పలు దేవాలయాల్లో అమ్మవార్లకు ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా శ్రీ సంతోషి మాత దేవాలయంలో మొదట గా మహిళలందరూ కలిసి ఒడి బియ్యం పోసినట్లు తెలిపారు. సకాలంలో వర్షాలు పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి భక్తులు గుండా సుధారాణి, కక్కిరేణి పద్మ, బెలిదే అశోకలక్ష్మీ, బ్రహ్మదేవర సరస్వతి, మీలా శ్రీదేవి, బచ్చు పద్మావతి, గుండా సువర్ణ, వరగాని శారద, కుక్కడపు ధనలక్ష్మి, నంద్యాల స్వాతి, గన్నవరపు గీత, పబ్బతి పద్మావతి శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.. 
 
 
 
 
 
 

About The Author