ఉపాధ్యాయ పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలి.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 29: తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం(టిజియుఎస్) సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం టిజియుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం(టిజియుఎస్) గిరిజన ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం పని చేస్తుందని చెప్పారు. త్వరలో జరగబోయే ఉపాధ్యాయ పదోన్నతులను ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఉద్యోగస్తులకు వెంటనే పి ఆర్ సి అమలు చేయాలని, 5 డిఎ లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వెంటనే డి ఏ ప్రకటించాలని కోరారు.

About The Author
02 Aug 2025