అవినీతి కాలుష్యం వెదజల్లుతున్న కాలుష్య నియంత్రణ మండలి.. !

( బడా బాబుల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు.. )

- నరక కూపంగా మారుతున్న తెలంగాణ పచ్చని భూములు.. 
- విష్యతుల్యమవుతున్న భూమి, నీరు, గాలి.. 
- జీవచ్ఛవాల్లా బ్రతుకునీడుస్తున్న తెలంగాణ ప్రజానీకం.. 
- మీడియా కోడైకూస్తున్నా లంచాల మత్తులో జోగుతున్న అధికార గణం.. 
- పర్యవేక్షణ లేదు.. పట్టించుకోవడం అనేది అసలే లేదు.. 
- ఔషధాల తయారీ పేరుతో గరళాన్ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు.. 
- చట్టాలు, నియమాలు, నిబంధనలు పేపర్లవరకే పరిమితం.. 
- భగవంతుడు ఇచ్చిన ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తున్న దౌర్భాగ్యం.. 
- రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కెమికల్ తయారీ ఫ్యాక్టరీలు.. 
- కాలుష్యం ఒకవైపు, భయంకరమైన ప్రమాదాలు మరోవైపు.. 
- సామాన్యుడి జీవితం పెద్దల ధనదాహానికి బలికావాల్సిందేనా..?
- ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ 
  అందిస్తున్న పరిశోధనాత్మక కథనం..    

కాలుష్యం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకర మహమ్మారి.. కాలుష్య కోరల్లో చిక్కి ప్రజలు విల విలలాడిపోతున్నారు.. జీవచ్ఛవాల్లా బ్రతుకును ఈడుస్తున్నారు.. ఇది ఎవరూ కాదనలేని భయంకర వాస్తవం.. మరి దీనికి కారణం ఎవరు..? నేల, నీరు, గాలి ఇలా ప్రకృతిలోని అన్ని సజీవ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి.. కాలుష్యాన్ని నివారించడానికి, అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నియమించిన కాలుష్య నియంత్రణ మండలి సైతం అవినీతి కాలుష్యంతో మునిగి తెలుస్తోంది.. అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారు.. బాధ్యతగా నిర్వర్తించాల్సిన విధులను వీధుల్లో విసిరేసిన చెత్త మాదిరిగా వదిలేస్తున్నారు.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. చివరికి పీల్చుకోవాల్సిన గాలిని సైతం కొనుక్కోవాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురౌతాయి.. ఇది వినడానికే భయం వేస్తుంది.. భగవంతుడు మనిషికి ఇచ్చిన విలువైన ఆస్తులు గాలి, నీరు, నేల వీటిని స్వేచ్ఛగా అనుభవించే హక్కు ఈ భూమ్మీద బ్రతుకీడుస్తున్న ప్రతి ప్రాణికీ ఉంది.. కానీ అవినీతి కీచకులు ఆడుతున్న వికృత క్రీడలో ఈ హక్కు కాలరాయబడుతోంది.. దీనికి అంతం పలకకపోతే భవిష్యత్తులో ఎన్నెన్నో విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. 
1000446613
 
హైదరాబాద్, జులై 29 ( భారత శక్తి ) : హైదరాబాద్ మహానగరం శివార్లలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందల కొద్ది కెమికల్ కంపెనీలు నెలకొని ఉన్నాయి.. జనాలకు ఉపయోగపడే ప్రోడక్ట్ తయారీ మంచిదే.. కానీ ఈ కంపెనీల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కొంపలు ముంచుతోంది.. ఒక కెమికల్ కంపెనీ స్థాపించాలంటే దానికి ఎన్నెన్నో విధులు, ఎన్నెన్నో పద్ధతులు ఉంటాయి.. ఈ మేరకు ప్రభుత్వం వారికి దిశా నిర్దేశం చేస్తుంది.. ఆ పద్దతులను అనుసరిస్తూ కంపెనీలు నడపాల్సి ఉంటుంది.. కానీ ఇన్ని వందల కంపెనీలలో కనీసం ఏ ఒక్క కంపెనీ కూడా మినిమమ్ నార్మ్స్ పాటించకపోవడం పెను ప్రమాదంగా పరిణమించింది.. ఇలాంటి కంపెనీల నుంచి కాలుష్యం పెద్ద మొత్తంలో వెలువడుతూ ఉంటుంది.. ఆ వెలువడిన కాలుష్యాన్ని ఒక పద్దతిలో, నిర్దేశించిన ప్రాంతానికి తరలించి దానిని శుద్ధి చేయాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంటుంది.. కానీ అలా జరగడం లేదు.. కంపెనీల నుంచి వెలువడుతున్న కెమికల్ నీరు, వాయు కాలుష్యం యధా తదంగా గాలిలో, భూమిలో కలిసిపోతున్నాయి.. వీటన్నిటినీ కట్టడి చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు లంచాలకు అలవాటుపడి చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.. కంపెనీ చాలా చక్కగా అన్ని వ్యవహారాలూ, నిబంధనలూ పాటిస్తున్నట్లు రిపోర్ట్స్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి.. దీంతో గాలి, నీరు, నెల అన్నీ కాలుష్య కాసారంలో మునిగిపోతున్నాయి.. మనుషులే కాకుండా జంతువులు, పక్షలు సైతం కనుమరుగైపోతున్నాయి.. 
 
1000446619
నిజానికి నియంత్రణ బాధ్యత తీసుకున్న కాలుష్య నియంత్రణ మండలి ఏమి చేస్తోంది..? ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కింద స్థాయినుంచి ఉన్నత స్థాయి వరకు అందరూ ఏమి చేస్తున్నారు..? వారికి బాధ్యత లేదా..? తమ తోటి మనుషులు కాలుష్య కోరల్లో చిక్కుని విలవిల్లాడిపోతుంటే వీరు మాత్రం అందిన కాడికి ఫ్యాక్టరీల యాజమాన్యం నుంచి అందుకుంటూ వికృత చేష్టలు చేస్తున్నారు.. వీరికి అక్రమ సంపాదన మీద ఉన్న ఆసక్తి సాటి మనిషి ప్రాణాల మీద ఉండటం లేదు..  
 
ఎన్నెన్నో చూశాం... ఇలాంటి కంపెనీల వల్ల ఎన్ని చోట్ల భూమి నాశనం అయ్యిందో.. తాగు నీరు కలుషితం అయ్యాయో.. గాలి కూడా విషతుల్యం అయ్యిందో..? కానీ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాధికారులు గానీ ఇసుమంతైనా స్పందించడం లేదు.. దీని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుంది.. కలుషితం అవుతున్న ప్రకృతి కన్నెర్ర జేస్తుంది.. ఇప్పటికే చేస్తోంది కూడా.. ఎన్నెన్నో విపత్తులు సామాన్య, అమాయక ప్రజలు ఎదుర్కొంటున్నారు.. బలిసిన వాళ్ళు మాత్రం బాగానే బ్రతికేస్తున్నారు.. అవసరమైతే ఆక్షిజన్ సైతం కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు.. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి..? ఈ భూమ్మీద జనమ ఎత్తినందుకు, ఆరోగ్యంగా బ్రతికే హక్కు కూడా లేకుండా పోతోంది.. తమ తప్పు లేక పోయినా అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు.. ఈ పరిష్టితిని చక్కదిద్దడానికి నడుం కట్టింది " ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ " సంస్థ.. మాతో మీరు చేతులు కలపండి.. కాలుష్య భూతాన్ని తరిమికొడదాం.. 
1000446615
 
తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి..? ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎన్ని కంపెనీలు నిబద్దతతో పనిచేస్తున్నాయి..? ఎన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి..? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి..? కాలుష్య నియంత్రణ మండలిలో పేరుకుపోయిన అవినీతి వ్యవహారం ఏమిటి..? అసలు ఇంతటి దారుణాలకు కారణభూతులు ఎవరు..? ప్రభుత్వం హవా చెలాయిస్తున్న పెద్దల హస్తం ఏమిటి..? ప్రకృతికోసం పోరాడుతున్న వారు ఎవరు..? ఎంతమేర విజయం సాధించారు.. ఇలాంటి భయంకర వాస్తవాలను " భారత శక్తి " సహకారంతో..వెలుగులోకి తీసుకుని రానుంది.. " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
1000446617

About The Author