రైతు భరోసా కింద భూస్వాములకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది.. 

వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచడం లేదు.. 
ఇది వారికి నమ్మకద్రోహం చేయటమే అవుతుంది : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.

 

WhatsApp Image 2025-08-01 at 8.56.26 PMసూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు చేనేత,బీడీ,గీత కార్మికులు,కండరాలు క్షీణిత వ్యాధి కలిగిన వారికి పెన్షన్ పెంచాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాలు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా సన్నాక సభను హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సభకు ముఖ్య అతిథులుగా పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ హాజరవడం తో వయోవృద్ధులు వికలాంగులు వారి సమస్యలను మంద కృష్ణ మాదిగ కు విన్నవించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు,వితంతువులు,వికలాంగుల,చేయూత పెన్షన్ దారుల కోసం2007 నుండి ఎమ్మార్పీఎస్ ముందుండి పోరాడుతుందని ఏ రాజకీయ పార్టీలు,ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడటం లేదని ఆగ్ర వ్యక్తం చేశారు.తాను పెన్షన్ తీసుకునే నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వాడిని కాబట్టి వారి బాధలు అర్థం చేసుకొని ఎమ్మార్పీఎస్ పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.6,000/-వృద్ధులు,వితంతువులు,ఒంటరి మహిళ,చేనేత,గీత,బీడి కార్మికులకు, డయాలసిస్ రోగులకు రూ.4,000/- కండరాల క్షీణత కలిగిన వారికి రూ.15,000/- లకు పెన్షన్ పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూములు ఉన్న వాళ్ల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం, అంతర్జాతీయ అందాల పోటీలకు వందల  కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం, రైతు భరోసా కింద భూములు ఉన్న భూస్వాములకు వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇవ్వాలా వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచకపోవడం చూస్తే ఈ వర్గాలకు నమ్మకద్రోహం చేయటమే అన్నారు.ఆగస్టు 13 న  హైదరాబాద్ లో జరగబోయే,వికలాంగులమరియు చేయూత పెన్షన్ దారుల మహాగర్జన ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

About The Author