ఆటో కార్మిక సోదరులకు అండగా ఉండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా.

ఆటో కార్మికుల కార్పొరేషన్  వారి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నాగరాజు.
ఆటో కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు , తాడు అధ్యక్షుడు రవికుమార్.

WhatsApp Image 2025-08-01 at 6.11.28 PM

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధి లోని చింతగట్టు క్రాస్ రోడ్డు వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు, మునిపల్లె, సుభాస్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్  ఆటో కార్మికులకు శుక్రవారం చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసిన  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు , తాడు అధ్యక్షుడు గుడిమల్ల రవి కుమార్.

Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

తొలుత ఆటో కార్మిక సోదరులు ఎమ్మెల్యే నాగరాజు కి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు...

Read More జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం !

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు  ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీ స్వయంగా ఆటో నడిపి ప్రారంభించారు....

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ:- ...

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వం ఆటో కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తా అని హామీలకే పరిమితమైందన్నారు కానీ నేడు ప్రజాప్రతితం ఏర్పడక  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆటో కార్మిక సోదరులకు 12,000 ఇచ్చే యోచన సన్నహాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. నాడు సాధనకై ఉద్యమం నిర్వహించి ఆటోలు బంద్ చేసి సకలజనుల సమ్మె భాగస్వామిలవుతూ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో  హసన్పర్తి మండల కేంద్రంలో ఆటో కార్మిక సోదరులు ఎక్కువ స్థాయి ఉన్నారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటూమన్నారూ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో వారికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తామనీ సందర్భంగా ఆటో కార్మికులకు హామీ ఇచ్చారు..

Read More సకాలములో గుండె ఆపరేషన్ నిమిత్తమై "ఓ" పాజిటివ్ రక్తం అందజేత

గత 10సం. రాలు పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు ఆటో కార్మికులను పట్టించుకోకుండా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత బస్  ప్రయాణం పెట్టీ ఆటో కార్మికుల పోట్టగొట్టారని ఆటో కార్మిక సోదరులను రెచ్చ కొడుతూ వారి రాజకీయ పబ్బం కోసం ఆటో కార్మికులను వాడుకుంటున్నారన్నారు. కావున ఆటో కార్మిక సంఘాలు కార్మికులు మాయమాటలను నమ్మొద్దని ఈ సందర్భంగా  ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు....

Read More నేటి భారతం :

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హసన్పర్తి పాక్స్ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

About The Author