ఏటీసి కోర్సుల గురించి విస్తృత ప్రచారం కల్పించాలి.

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి  ), జూలై 29:ఐటిఐ, ఏటిసి సెంటర్ లలో ఉన్న  కోర్సుల గురించి జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు.ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మంగళవారం
ఐటిఐ ప్రవేశాలు, అక్షరాస్యత, పారిశుద్ధ్య నిర్వహణ, పెట్రోలు పంపు ఏర్పాటు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ  జిల్లాలో బి.పి.సి.ఎల్, ఐ.ఓ.సి.ఎల్ ప్రతినిధులతో కలిసి గుర్తించిన స్థలాలను పరిశీలించి పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అనుకూలంగా ఉన్న స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, రఘునాథపాలెం, మధిర, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలం తహసీల్దార్ల సమన్వయంతో ఎంపిక చేయాలని అన్నారు. ప్లాంట్ నిర్మాణానికి గల అవకాశాలపై రిపోర్ట్ అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఐటిఐ, ఏటిసి కేంద్రాలలో మొత్తం 255 సీట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాలను కవర్ చేస్తూ ఐటిఐ, ఏటిసి కోర్సుల పట్ల యువతకు అవగాహన కల్పించాలని, వీటికి జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమీషనర్ పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఐటిఐ, ఏటీసీ సెంటర్ లో అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల గురించి చిన్న, చిన్న వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని అన్నారు.  ఇంటర్ డ్రాప్ ఔట్ విద్యార్దుల వివరాలను సేకరించి, వారికి ఐటిఐ, ఏటీసీ కోర్సుల గురించి వివరించి వారికి ఆసక్తి కల్గిన కోర్సులో జాయిన్ చేయాలని అన్నారు.

ఖమ్మం జిల్లాలో అక్షరాస్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాల పరిధిలో చదవడం, రాయడం రాని వారిని గుర్తించాలని అదనపు కలెక్టర్ అదనపు డి.ఆర్.డి.ఓ. ను ఆదేశించారు. అక్షరాస్యత పెంచడం పై రిసోర్స్ పర్సన్ కు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.  జిల్లాలో గుర్తించిన 10వ తరగతి పాస్ కాని ప్రజలకు అవగాహన కల్పించి ఆగస్టు 5 వరకు ఓపెన్ స్కూల్ లో జాయిన్ చేయాలని అన్నారు. 

1000002912ఖమ్మం జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అభివృద్ధి పనులను చేసామని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కడైనా టాయిలెట్ మరమ్మత్తులు, కాంపౌండ్ వాల్ మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులకు మున్సిపాలిటీల ద్వారా  అవసరమైన ప్రతిపాదనలు ఆగస్టు 10 లోపు అందించాలని అన్నారు. మున్సిపాలిటీలలో ఉన్న జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ లేని పక్షంలో  5 కంప్యూటర్ లతో ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సుల వివరాలు, అందుబాటు లో ఉన్న సీట్లపై  మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ద్వారా ప్రచారం చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ఆర్డీఓ నరసింహా రావు, అడిషనల్ డిఆర్డీవో జయశ్రీ,  ఖమ్మం మున్సిపల్ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, మునిసిపల్ కమీషనర్లు శ్రీనివాస రెడ్డి, సంపత్ కుమార్,
సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 

About The Author