జి ప్లస్ త్రీ మోడల్ ఇండ్ల నిర్మాణానికి స్థలసేకరణ పనులు వేగవంతం చేయాలి
ఆదేశించిన కలెక్టర్ పి ప్రావిణ్య
జిల్లాలో G+3 మోడల్ గృహ నిర్మాణానికి భూదాన్ భూముల గుర్తింపు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి జిహెచ్ఎంసి పరిధిలోని మండలాలకు చెందిన రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖ, జిహెచ్ఎంసి అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయము లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జిహెచ్ఎంసి పరిధిలోని మండలాలలో G+3 మోడల్ గృహ నిర్మాణాల కోసం తాసిల్దార్ లు, తమ పరిధిలో భూదాన్ భూములను గుర్తించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిహెచ్ఎంసి, మున్సిపల్ పరిపాలనా పరిధిలో ఉన్న స్లమ్ ప్రాంతాలను గుర్తించి, అక్కడ నివాసిస్తున్న ప్రజలకు సురక్షితమైన 2BHK గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 5956 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో 2BHK గృహాల కోసం ఇప్పటికే 592 మందికి గృహాలు లబ్ధిదారులకు కేటాయించబడినప్పటికీ, కొన్ని కారణాల వల్లన మంజూరు అయిన ఇండ్లను వారు స్వాధీన పరుచుకోలేకపోయిన నేపథ్యంలో వారికి మరోసారి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేకాక, గృహాలను ఇప్పటికీరంతో టూ బిహెచ్కె గృహ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 2BHK గృహా సముదాయాల నిర్వహణ బాధ్యత రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) లకు ఉండేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ సంఘాలను ఏర్పాటు చేయాలనీ జిల్లా సహకార శాఖ అధికారులను ఆదేశించారు . ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి చలపతి రావు , పటాన్చెరువు నియోజకవర్గ తహసీల్దార్లు ,మునిసిపల్ కమిషనర్లు ,జి హెచ్ ఏం సి అధికారులు జిహెచ్ఎంసి అధికారులు
సిబ్బంది పాల్గొన్నారు .