శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నాగ పంచమి పూజలు..


1000002893సూర్యాపేట జిల్లా బ్యూరో( భారత శక్తి )జూలై 29: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో శ్రావణ శుద్ధ పంచమి (నాగ పంచమి) సందర్భంగా మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆకు పూజలు, శ్రావణ మంగళ గౌరీ దేవి వ్రతం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ దేవాలయంలో వేం చేసి ఉన్న మానసా దేవి, శ్రీ సంతాన నాగదేవత అమ్మవార్లకు ప్రత్యేకంగా భక్తుల స్వహస్తాలతోటి పంచామృత అభిషేకం నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, ఆకు పూజ వడమాల సేవా కార్యక్రమం నిర్వహించారు.శ్రావణమాసం మంగళవారం పురస్కరించుకొని మంగళ గౌరీ దేవి వ్రతము నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, ఉప కోశాధికారి కొత్త మల్లికార్జున్, సహాయ కార్యదర్శి ఉప్పల రమేష్, కమిటీ సభ్యులు  కక్కిరెనీ  పద్మ, భక్తులు గుండా సువర్ణ, బండారు వనజ,కొప్పుల పద్మావతి, రేణుక, శ్రావ్య, దేవాలయ సహాయ అర్చకులు అశోక్ మిశ్రా దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.. 
 
 
 
 
 
 

About The Author