వేములవాడ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్

WhatsApp Image 2025-08-01 at 7.50.33 PMవేములవాడ పట్టణంలోని ఎస్.ఆర్.ఆర్ ప్లంబర్స్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం పట్టణంలోని ఉర్దూ మీడియం స్కూల్ ఆవరణలోని ప్రైవేట్ భవనంలో జరిగాయి.నూతన అధ్యక్షులుగా అబ్దుల్ రజక్ గెలుపొందగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా శంశొద్దీన్, ఉపాధ్యక్షులుగా రంజాన్,కోశాధికారిగా జాకీర్, కార్యవర్గ సభ్యులుగా ఎన్. ప్రవీణ్, డి.ప్రసాద్,రఫీక్, సల్మాన్, ప్రభాకర్, యూసుఫ్ ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణ కమిటీ తెలిపింది.ఈ సందర్భంగా ప్లంబర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ అధ్యక్షుడిగా తనను అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన ప్లంబర్ అసోసియేషన్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తానని సంఘ సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కార దిశగా తీసుకెళ్తానని ఆయన తెలిపారు. అనంతరం ఎన్నికలలో నూతనంగా గెలుపొందిన ప్లంబర్ అసోసియేషన్ కమిటీని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author