వైష్ణోయ్, ప్రెస్టీజ్ గ్రూపుల అక్రమాలను అరికట్టే నాధుడే లేడా..!

మర్రివోని కుంట నల్లవాగు కబ్జాకు గురైంది డిప్యూటీ సీ.ఎం భట్టి స్టేట్మెంట్..

హనుమాన్ దేవాలయంలో ఆవేదనతో ప్రమాణం చేసిన మద్ది రాజశేఖర్ రెడ్డి

వైష్ణోయ్  వెంచర్ వారు కబ్జా చేస్తున్నారని  మాట్లాడితే మాజీ టిఆర్ఎస్ కార్పొరేటర్లు  వేధింపులకు గురి చేస్తున్నారు..

ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు ఇస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం..

హైదరాబాద్  జూలై 29 (భారతశక్తి): మామిడిపల్లి గ్రామంలోని ప్రెస్టేజ్ గ్రూప్, వైష్ణోయ్ , సంస్థలకు చెందిన వెంచర్ యజమానులను డబ్బులు అడగలేదని మామిడిపల్లి మాజీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలకు సవాల్ గా మంగళవారం మామిడిపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో హనుమంతుడి విగ్రహంపై బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ కార్పొరేటర్ అయిన యాతం పవన్ యాదవ్, సుక్క శివకుమార్ ఇద్దరు ప్రెస్టేజ్ వెంచర్ యజమానులతో కుమ్మక్కైయ్యారని అన్నారు. వారు మర్రివానికుంట, నల్ల వాగు  భూమి కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన తన పైనే కావాలని వారు డబ్బుల కోసమే బ్లాక్ మెయిల్  డ్రామా ఆడుతున్నాడని మాట్లాడడంపై ఆరోపణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలల నుండి మామిడిపల్లి,  వైష్ణోయి  ప్రెస్టేజ్  గ్రూప్ కబ్జా  అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మార్వోకు, ఆర్డీవోకు, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని సిపికి ఫిర్యాదు చేస్తే తప్పా అని అన్నారు.భూ కబ్జా జరుగుతుందని నేను ఆరోపిస్తే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు.
 
1000002935

10000029441000002946మాజీ కార్పొరేటర్లు ఇద్దరు తనపై వేసిన ఆరోపణలు నిరూపించకపోతే తిరిగి వారు హనుమాన్ దేవాలయంలో హనుమంతుడి పైన ప్రమాణం చేయాలని నిలదీశారు.108,109 సర్వే నెంబర్లలో నవాబులకు చెందిన భూమి ఉందని తెలిపారు. ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో వాటిని బయటికి తీసి  గ్రామస్తులకు దక్కే విధంగా చూస్తామన్నారు. పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ప్రెస్టేజ్ వెంచర్ లో మర్రిమోనీ కుంట ఉందని ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్లు గుర్తు చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి  ఎప్పుడు ప్రజలకు సేవ చేయడమే కానీ అక్రమంగా వసూళ్లు చేయలేదని తెలిపారు.
 
1000002942
అలా నిరూపించే శక్తి ఉందా అని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని ప్రశ్నించారు. నిరూపించకపోతే మాజీ కార్పొరేటర్లు రాజకీయాలు వదులుకుంటారా అని ఆరోపించారు. నా సతీమణిపై ఆరోపణ చేసినందుకు వారి పైన పరువు నష్టం దావా కేసు వేస్తానని హెచ్చరించారు. మామిడిపల్లి చెందిన మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్, శివకుమార్ చేసిన బాగోతాన్ని బయటకి తీస్తానని అన్నారు. బిజెపి కార్యకర్తలు నీతి నిజాయితీకి ఆదర్శంగా ఉంటారన్నారు. 
1000002940
 
 

About The Author