ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా
వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్
వరంగల్లో పట్టుకున్న 16 లారీలు విడుదల చేయాలి
ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీఎండీసీ ద్వారా ఇసుక రీచ్లలో నుంచే ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం హనుమకొండ ఆర్టిఓ ఆఫీసు ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇసుక రవాణాలో ప్రభుత్వ నిబంధనలను పాటించి దానికి అనుగుణంగానే ఇసుక రవాణా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా టీజీఎండిసి అనుమతి ప్రకారంగా ఇసుక రీచ్ లో నుండి ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి వరంగల్ విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా 16 లారీలను పట్టుకుని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ విషయంపై లారీ యజమానులు స్పందించి
పట్టుకున్న లారీలను వదిలేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా కాలయాపన చేసి తమను వేధిస్తున్నారని ఆరోపించారు. వర్షాల కారణంగా రోజుల తరబడి ఇసుక వాగుల్లో లారీలు నిలిచి ఉండడం వల్ల ఓనర్లు ఫైనాన్సులు,చెల్లింపులు చేస్తు నష్టాల్లో ఉన్నామంటే టీజీఎండిసి ద్వారా ఇసుక రీచుల్లల్లో ఎక్కువ తక్కువ కాంటా నిర్వాహకం వల్ల మా ఇసుక రవాణా చేసే లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకుని జరిమానా వేస్తూ లారీ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా తాడిచెర్ల ఇసుక రీచ్లో లారీలు వెళ్లి ఆరు రోజుల తర్వాత లోడింగ్ చేసుకొని టీజీ ఎండిసి కాంట తూకం వేయడం జరిగింది. 16 టైర్ల లారీ తో 49 టన్నులు పంపించడం జరిగింది. కానీ వరంగల్ విజిలెన్స్ అధికారులు ఆపి కాంట వేయడంతో 16 టైర్ల లారీతో 50 టన్నుల 200 క్వింటాళ్లు బరువు వచ్చింది. ఇసుక వాగులో ఉన్న కాంటా తప్పుడు ఉన్నందువల్ల అక్కడ నిర్వహిస్తున్న టీజీఎండీసీ అధికారులపై, కాంట్రాక్టర్ల పైన చర్య తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను తనిఖీలు, తూకాలతో విజిలెన్స్ మైనింగ్ రవాణా శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం వద్దని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నొప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస నాయుడు, గుండు లింగన్న గౌడ్, కార్యదర్శులు శేఖర్ గౌడ్, ఏర్పుల రాజేష్ ఆంజనేయులు, కోశాధికారి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.