దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమైనది..
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 30:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోగల ఎండిఆర్ హైస్కూల్ నందు బుధవారం విద్యార్థుల మానసిక వికాసానికి మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో భాగంగా గురువు శ్రీ త్రీవిక్రమానందాచార్యులు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదన్నారు విద్యార్థులు గురువులను గౌరవించాలని,తల్లిదండ్రుల పట్ల ప్రేమ భావాలను కలిగి ఉండాలని,అటువంటప్పుడు మాత్రమే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్యను అభ్యసించేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో అభ్యసించాలన్నారు. విద్యార్థులకు మానసిక ఉల్లాసం ఎంత ముఖ్యమో శారీరక ఉల్లాసం కూడా అంతే ముఖ్యమని దాని కొరకు ప్రతిరోజు 30 నిమిషాల పాటు ఆటలాడాలన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు విదేశాల్లో స్థిరపడాలని తల్లిదండ్రులను కుటుంబాన్ని దేశాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారని,అలాకాకుండా మన చదువు దేశానికి తల్లిదండ్రులకి సమాజానికి ఉపయోగపడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండిఆర్ విద్యా సంస్థ చైర్మన్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి జీవితాన్ని నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం డి ఆర్ విద్యాసంస్థ ప్రిన్సిపల్ నలబోలు భూపాల్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పుడు కష్టపడితే జీవితం మొత్తం ఆనందంగా గడపవచ్చును, తల్లిదండ్రులు బాగా చూసుకోవచ్చు అని అన్నారు. ఇట్టి కార్యక్రమం ఏవో నర్సిరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
02 Aug 2025