నారిశక్తి కార్యక్రమం పై పోలీసు అక్కలతో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో (భారత శక్తి)జూలై 31:నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహించే నారీశక్తి కార్యక్రమం పై జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసుల తో ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేసి, వారి అనుభవాలు, సవాళ్లు, విజయాలపై చర్చించారు.

పోలీసు అక్కలతో ముఖాముఖీ

ఈ సమావేశంలో మహిళా సిబ్బంది కార్యక్రమం వల్ల కలిగిన సానుకూల మార్పులు గురించి పంచుకున్నారు. రిసెప్షన్ నుంచీ రెస్పాన్స్ దాకా వారు ఎంత ఎదిగారో, ఎలా ప్రాణాలు కాపాడారో వారు స్వయంగా వివరించారు.
1000003194మాటలు చెప్పిన అక్కలు... స్ఫూర్తిదాయకమైన అనుభవాలు

 శ్రీలత – లక్ష్మణ చందా పోలీస్ స్టేషన్-
ఒకప్పుడు రిసెప్షన్ వరకే పరిమితమయ్యాం. నేడు నారీశక్తి వల్ల డయల్ 100, పెట్రోలింగ్ డ్యూటీలు చేస్తూ, ధైర్యంగా ముందుకు సాగుతున్నాం. లింగభేదం అడ్డంకి కాదని నిరూపించాం.

శివాని – నిర్మల్ వన్ టౌన్:
నారీ శక్తి మొదటి రోజే ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. మొదట భయపడ్డా... కానీ చివరికి ఓ ప్రాణాన్ని రక్షించగలిగాను. ఇదే నిజమైన పోలీసు మహిళగా నా పాత్రకు అర్థం.

రాజమణి – ముధోల్ పోలీస్ స్టేషన్:
రోడ్డు ప్రమాద సమయంలో వేగంగా స్పందించి గాయపడినవారిని హాస్పిటల్ తరలించాం. ఆ సంతృప్తి మాటల్లో చెప్పలేం.

సంధ్య సోన్ – మాజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి: ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలి పోలీస్ శాఖలో చేరాను. నారీశక్తి కార్యక్రమం వల్ల పోలీసు అక్కగా గుర్తింపు లభించింది. కార్పొరేట్ టైటిల్స్ కన్నా యూనిఫాం గొప్పదనిపించింది.

షహానో భాను – నర్సాపూర్: నాకు ఎప్పుడూ భయం ఎక్కువ. కానీ ఇప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తున్నాను. మఫ్టీలో ఉన్నా ప్రజలు నన్ను పోలీసుగా గుర్తించడం గర్వంగా ఉంది.ఈ సందర్భంగా ఎస్పీ డా. జానకి షర్మిల మాట్లాడుతూ –పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదు, అది సేవా ధర్మం. మహిళా సిబ్బంది కుటుంబ బాధ్యతలు మరియు ఉద్యోగ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహిస్తూ ముందు సాగాలి. నారీ శక్తి అనేది ఉద్యోగ సంతృప్తిని కలిగించడంతో పాటు పోలీస్ వ్యవస్థలో మహిళల పాత్రను బలోపేతం చేస్తుంది. ఇది ఎప్పటికీ కొనసాగాలి అని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పేర్కొన్నారు. 
 
 
 
 
 
 

About The Author