కడెం పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో (భారత శక్తి)జూలై 29: మంగళవారం  కడెం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి డా: జి. జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా  పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసుల గురించి ఎస్ఐ ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సిబ్బందిని ఎవరెవరూ ఏయే విధులు నిర్వహిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని అన్నారు.
1000002874

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. గంజాయి వినియోగం పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఎడ తెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, పక్కనే కడెం ప్రాజెక్టు ఉన్నందున వరదలు సంభవించే ప్రాంతాల్లో సిబ్బంది చాలా అలర్ట్ గా ఉండాలని, ఏవైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే అధికారులు,సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు
అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి  తీసుకొని రావాలి అని సూచించారు. అనంతరం ఎస్ఐ సాయి కిరణ్ ను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 
 
 
 
 
 
 

About The Author